వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలక ముందడుగు: సరిహద్దు వివాదానికి శాంతి చర్చలతో ముగింపు: భారత్-చైనా దళాల వెనక్కి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు భారత్, చైనాలు ముందుకు వచ్చాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు జూన్ 6, జూన్ 22న మిలిటరీ కమాండర్ల మధ్య జరిగిన అవగాహన ఒప్పందాన్ని భారత్, చైనా దేశాలు నిబద్ధతో అమలు చేయాలని వర్కింగ్ మెకానిజమ్ ఫర్ కన్సల్టేషన్ అండ్ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమావేశంలో ఇరుదేశాలు నిర్ణయించాయి.

పాక్ కంటే పెద్ద శత్రువు చైనానే: మోడీపైనే దేశ ప్రజల విశ్వాసం, రాహుల్‌ను నమ్మలేమంటూ..పాక్ కంటే పెద్ద శత్రువు చైనానే: మోడీపైనే దేశ ప్రజల విశ్వాసం, రాహుల్‌ను నమ్మలేమంటూ..

శాంతియుతంగా..

శాంతియుతంగా..

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన తాజా సమావేశంలో ఇరుదేశాల విదేశాంగ శాఖ అధికారులు పాల్గొన్నారు. తూర్పు లడఖ్‌లో చోటు చేసుకున్న ఇటీవలి పరిణామాలపై భారత్ తన ఆందోళనను చైనాకు తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితులను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు, ఇరు దేశాల ద్వైపాక్షి, సైనిక స్థాయిలో ఒకరికొకరు సహకరించుకుంటూ కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.

ఒప్పందాలు, ప్రోటోకాల్ ప్రకారం..

ఒప్పందాలు, ప్రోటోకాల్ ప్రకారం..

అంతేగాక, వాస్తవాధీన రేఖను భారత్-చైనా తప్పకుండా గౌరవించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఇరుదేశాల ప్రతినిధులు గతంలో జరిగిన అవగాహన మేరకువాటిని వేగవంతం చేసేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఇది సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు, రెండు దేశాల మధ్య విస్తృతస్థాయి సంబంధాలను నెలకొల్పేందుకు సహాయపడుతుందని డబ్ల్యూఎంసీసీ చర్చల అనంతరం విదేశాంగ ప్రకటన విడుదల చేసింది.

Recommended Video

#IndiaChinaFaceOff : China తో చర్చలు సఫలం,ఒక అవగాహనకు వచ్చిన ఇరు దేశాలు..సైన్యాల ఉపసంహరణ !
చైనా దొంగ నాటకాలు మాత్రం..

చైనా దొంగ నాటకాలు మాత్రం..

కాగా, గత కొంత కాలంగా సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే, జూన్ 15న మన దేశ సరిహద్దులోకి వచ్చేందుకు ప్రయత్నించి మన జవాన్లపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. చైనా దళాలు జరిపిన ఈ దాడిలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. భారత భద్రతా బలగాలు జరిపిన ప్రతిదాడిలో సుమారు 45 మంది వరకు చైనా సైనికులు కూడా హతమయ్యారు. అయితే, చైనా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అంతేగాక, భారత దళాలే రెచ్చగొట్టి దాడులకు దిగాయని చైనా తన దొంగ నాటకాలకు తెరతీస్తోంది.

English summary
China and India on Wednesday agreed to "strictly abide" by the important consensus reached by their leaders and a series of agreements, further strengthen the confidence-building measures in the military field and jointly safeguard peace and tranquillity in the border areas, the Chinese foreign ministry said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X