వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డోక్లామ్‌లో మళ్ళీ టెన్షన్: పోటా పోటీగా ఆర్మీ మోహరింపు, డ్రాగన్‌కు ఇండియా షాక్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత,చైనాల మధ్య వివాదానికి కారణంగా మారిన డోక్లామ్ వద్ద పరిస్థితి నివురు గప్పిన నిప్పులా తయారైంది. రెండు దేశాలు డోక్లామ్ ప్రాంతంలో తమ బలగాలను మోహరిస్తున్నాయి. రెండు దేశాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇండియాకు డ్రాగన్ షాక్: డోక్లామ్‌లో రోడ్డు, ఆర్మీ క్యాంప్ఇండియాకు డ్రాగన్ షాక్: డోక్లామ్‌లో రోడ్డు, ఆర్మీ క్యాంప్

తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాల్లో రెండు దేశాల బలగాల మోహరింపు స్పష్టంగా కన్పిస్తోంది.ఈ పరిస్థితులను పరిశీలించిన పశ్చిమాసియా దేశాలు రెండు దేశాల మధ్య యుద్దానికి ఈ పరిస్థితులు సంకేతాలను విడుదల చేస్తున్నాయా అనే అనుమానాలను కూడ వ్యక్తం చేశాయి.

ఇండియాకు డ్రాగన్‌ షాక్: సియాచిన్ సమీపంలో 36 కి.మీ రోడ్డు నిర్మాణంఇండియాకు డ్రాగన్‌ షాక్: సియాచిన్ సమీపంలో 36 కి.మీ రోడ్డు నిర్మాణం

డోక్లామ్ వద్ద గత ఏడాది సుమారు 72 రోజులకు పైగా చైనా, ఇండియా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల ఆర్మీ పరస్పరం దాడులు కూడ చేసుకొన్న సందర్భాలు కూడ లేకపోలేదు.

అగ్ని -5: చైనాకు ఇండియా షాక్, అమెరికా సరసన భారత్, ఇక టార్గెట్ ఇదే!అగ్ని -5: చైనాకు ఇండియా షాక్, అమెరికా సరసన భారత్, ఇక టార్గెట్ ఇదే!

అయితే ఈ విషయమై చైనాతో ఇండియా దౌత్యపరంగా ఈ సమస్యలను పరిష్కరించుకొంది. ఈ ప్రాంతంలో పరిస్థితిలో మార్పు వచ్చిందని భావిస్తున్న తరుణంలో డోక్లామ్ ప్రాంతంలో చైనా రోడ్లు ఏర్పాటు చేయడం, సైనిక స్థావరాలను నిర్మించుకోవడం ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో ఇండియా కూడ తమ బలగాలను డోక్లామ్ ప్రాంతంలో మోహరించింది.

డోక్లామ్ వద్ద యుద్ద వాతావరణం

డోక్లామ్ వద్ద యుద్ద వాతావరణం

డోక్లామ్ వద్ద యుద్ద వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌- చైనాల మధ్య వివాదభూమి-- డోక్లాం వద్ద ఇపుడు నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. చైనా ఈ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఓ సైనిక స్థావరంగా మార్చేసింది. భూరత భూభాగం నుంచి కేవలం 81 మీటర్ల దూరంలోనే చైనా తన ఆర్మీని ఉంచింది.ఆర్మీ కోసం సకల వసతులను కల్పించింది. అంతేకాదు ఓ రన్‌వే ను కూడ నిర్మించింది. చైనాకు ధీటుగా ఇండియా కూడ ఇదే తరహలో తన బలగాలను ఆ ప్రాంతంలో మోహరించింది.

భారత్ రెండు వైమానిక కేంద్రాలు రెఢీ

భారత్ రెండు వైమానిక కేంద్రాలు రెఢీ

డోక్లామ్ వద్ద చైనా దూకుడుకు వ్యతిరేకంగా భారత్‌ కూడా రెండు వైమానిక స్థావరాలను సిద్ధం చేసింది. సిలిగురి దగ్గర్లోని బాగ్‌దోగ్రా, హసిమారా స్థావరాలను ఇండియా ఏర్పాటు చేసింది. చైనాకు తాము కూడ ధీటుగా వ్యవహరిస్తామని రుజువు చేసింది. బాగ్‌దోగ్రా వద్ద 30 సుఖోయ్‌ ఎంకె తరహా యుద్ధవిమానాలను మోహరించింది.

Recommended Video

రావత్ వ్యాఖ్యలపై చైనా ఉలిక్కిపాటు, ఆగ్రహం: డొక్లాం వివాదం ముగిసిందా?
అత్యాధునిక ఆయుధాలతో చైనా ఆర్మీ కాపలా

అత్యాధునిక ఆయుధాలతో చైనా ఆర్మీ కాపలా

డోక్లామ్ వద్ద చైనా ఆర్మీ అత్యాధునిక ఆయుధాలతో కాపలా కాస్తోంది. సుమారు 600 మందికి పైగా చైనా ఆర్మీ అత్యాధునిక ఆయుధాలను చేతబూని డోక్లామ్ వద్ద కాపలా కాస్తున్నారు అంతేకాదు తమ సైనికుల ఆవసరాల కోసం చైనా ఆ ప్రాంతంలో 10 కిలోమీటర్ల రోడ్డును కూడ నిర్మించింది.చైనాకు సంబంధించినంత వరకూ లాసా గాంగ్‌గార్‌, షిగాట్సే పీస్‌ ఏర్‌పోర్టులు వ్యూహాత్మకంగా అత్యంతకీలకమైనవి. ఇవి రెండూ డోక్లాం పీఠభూమిలోనే ఉన్నాయి. లాసాలో 18 జే-10 రకం యుద్ధవిమానాలను, 11 జే-5 రకం యుద్ధవిమానాలను మోహరించింది.

చైనాకు ధీటుగా భారత్ సమాధానం

చైనాకు ధీటుగా భారత్ సమాధానం

భారత్ కూడ అత్యాధునికమైన విమానాలను రంగంలోకి దించింది. బ్రహ్మోస్‌ క్షిపణిని కూడా ఇవి మోసుకుపోయి ప్రయోగించగలవు.హసిమారా స్థావరంలో మిగ్‌-27 యుద్ధవిమానాలను దింపింది.భూతల యుద్ధానికి సన్నద్ధం చేస్తూ సైనిక పటాలాలను క్రమేణా భారత్‌ కూడా దింపుతోంది. చైనా గనక ఏ దుస్సాహసానికి దిగినా క్షణాల మీద ప్రతిదాడులు చేయడానికి తాము సిద్దంగా ఉన్నామనే సంకేతాలను భారత్ ఇస్తోంది.

పరిస్థితి విషమిస్తోంది

పరిస్థితి విషమిస్తోంది

పరిస్థితి విషమిస్తోందని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.వాస్తవాధీన రేఖ వెంబడి ఏ చిన్న గొడవ జరిగినా డోక్లాం వద్ద యుద్ధవిమానాల గర్జన మొదలైపోయే అవకాశం ఉందని ఆ దేశాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.గత ఏడాది ఆగష్టులో శాంతిని నెలకొల్పేందుకు గాను రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

English summary
This is an area of interim borders and unsettled claims. While tensions have calmed since the last stand-off on the Doklam plateau, along the Line of Actual Control (LAC) which ended in August of last year, both sides are continuing to build up their ground forces in this inhospitable terrain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X