వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుద్దానికి కౌంట్‌డౌన్: ఇండియాపై చైనా మీడియా కథనం, సమర్థించిన అధికారి
న్యూఢిల్లీ: చైనా మీడియా మరోసారి ఇండియాపై రెచ్చగొట్టేలా వ్యవహరించింది. శాంతి, సమన్వయంతో ముందుకువెళ్ళాలనుకొనే దశలో చైనా మీడియా మరోసారి రెచ్చగొట్టే విధానాలకు పాల్పడుతోంది.
ఇక భారత్‌తో యుద్దానికి కౌంట్‌డౌన్ మొదలైందని చైనా మీడియా కథనాలను ప్రసారం చేసింది. ఈ మేరకు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రసారం చేసింది.

ఈ కథనాన్ని బలపర్చేలా ఓ ఉన్నతాధికారి కూడ మాట్లాడారు. ఢిల్లీ చేస్తున్న చర్యలు తమ సైన్యం ఉత్తరాఖండ్, కాశ్మీర్‌లోకి అడుగుపెట్టేలా చేస్తున్నాయంటూ ఆ పత్రిక కథనాలను రాసింది.
డోక్లామ్ సమస్యలకు శాంతి చర్చలతో పరిష్కారం అవుతోందన్న ఆశలు సన్నగిల్లాయని పేర్కొన్నారు. సమరానికి సమయం దగ్గరపడిందని, శాంతి ద్వారాలు మూసుకుపోయాయని చైనా మీడియా ప్రకటించింది.భారత్ పూర్తి బాధ్యత వహించాలంటూ చైనా అధికారిక పత్రిక కథనం ప్రసారం చేసింది.