• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సరిహద్దులో టెన్షన్: చైనా వెనుకడుగు -ఎల్ఏసీ నుంచి 10వేల మంది వాపస్ -అసలు రీజన్ ఇదే..

|

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. చలికాలంలో యుద్ధానికి సై అంటూ రెండు దేశాలూ భారీ ఎత్తున బలగాలను, ఆయుధ సంపత్తిని మోహరించాయి. ప్రధానంగా తూర్పు లదాక్ ప్రాంతంలో ఫేస్ టు ఫేస్ తరహా పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. అయితే..

చైనాలో మళ్లీ తిరగబెట్టిన కరోనా -ఐదు నెలల తర్వాత భారీగా కేసులు -లాక్‌డౌన్ -కుట్ర కోణం?

ఇటీవల తూర్పు లదాక్ సమీపంలోని ఎల్ఏసీకి సమీపంలో అనూహ్య పరిణామాలు జరిగాయి. ఇండియాతో యుద్ధం కోసం చైనా మోహరింపజేసిన బలగాల నుంచి దాదాపు 10వేల మంది జవాన్లను వెనక్కి పిలిపించుకున్నట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ పరిణామం ఎల్ఏసీకి 150 కిలోమీటర్ల పరిధిలో చోటుచేసుకుందని, రేఖ వద్ద మాత్రం పరిస్థితి టెన్షన్ గానే ఉందని పేర్కొన్నాయి.

 China Moves Back Around 10,000 Troops From Depth Areas Near LAC In Ladakh

ఇండియాతో యుద్ధానికి దాదాపుగా సన్నద్ధమైన చైనా.. సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో భారీ ట్రైనింగ్ క్యాంపులను ఏర్పాటు చేసి, దాదాపు 50 వేల మంది జవాన్లను అక్కడ నిలిపి ఉంచింది. భారత్ సైతం అదే సంఖ్యలో జవాన్లను సరిహద్దుకు తరలించింది. తాజాగా చైనా తన బలగాల నుంచి 10 మందిని ఉపసంహరించుకుంది. కాగా

లదాక్ సహా ఎల్ఏసీ ప్రాంతంలో విపరీతమైన చలి కారణంగానే చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉండటం, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ట్రూప్స్ ప్రయాణం కష్టతరం అవుందని, అందుకనే చైనా తన దళాలను వెక్కు తీసుకుందని తెలుస్తోంది. అయితే, మళ్లీ వేసవిలోగా చైనా తన బలగాలను తిరిగి రప్పించినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆర్మీ వర్గాలు వ్యాఖ్యానించాయి.

వ్యాక్సిన్‌పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే -సీఎంలకు ప్రధాని భరోసా -నేతలు ఎగబడొద్దని వార్నింగ్

రెండు దేశాల మధ్య 10 నెలలుగా కొనసాగుతోన్న ఉద్రికతల్లో ఒకసారి రక్తపాతం, రెండు మూడు సార్లు తుపాకి కాల్పులు చోటుచేసుకున్నాయి. స్టేటస్ కో ఏర్పడేలా రెండు దేశాల సైనిక, దౌత్య అధికారులు పలు మార్లు చర్చలు జరిపినా ఫలితం రాలేదు. ప్రస్తుతం ఎల్ఏసీలోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలు, రేజాంగ్ లా తదితర ప్రాంతాలపై భారత్ పట్టు కొనసాగిస్తున్నది.

English summary
In a significant development, the Chinese Army has moved back around 10,000 troops from the depth areas near the Line of Actual Control in Eastern Ladakh. However, the deployment in the frontline areas has remained the same and the troops from both sides remain in an eyeball to eyeball situation at several locations in that sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X