వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ విషయంలోజోక్యం చేసుకోవద్దు... చైనాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్ ‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే ప్రతిపాదనను వ్యతిరేకించిన చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కశ్మీర్ అంశం తమ అంతర్గత వ్వవహారమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావిష్ కుమార్ తేల్చి చెప్పారు. భారత దేశం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని , అదే విధంగా భారత దేశ అంతర్గత విషయాల్లో ఇతర దేశాల జోక్యాన్ని కూడ అంగీకరించమని స్పష్టం చేశారు.

భారత ప్రభుత్వం జమ్ము కశ్శీర్‌ విభజనపై నిర్ణయం తీసుకున్న నిర్ణయాలపై స్పందించిన చైనా, జమ్ముకశ్మీర్ అంశంపై ఏకపక్ష నిర్ణయాలకు భారత్‌ దూరంగా ఉండాలని, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతగా విడదీయడం అంగీకారయోగ్యం కాదని అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో భారత్ కూడ వెంటనే స్పందించింది. ఈనేపథ్యంలోనే భారత్ ఘాటుగా సమాధానమిచ్చింది.

China not to interfere in the internal matter of India

ముఖ్యంగా చైనా మిత్రదేశమైన పాకిస్థాన్‌ ప్రయోజనాలతోపాటు , చైనా-ఇండియా సరిహద్దులోని లద్దాఖ్‌లోని వివాదాస్పద అక్సాయ్‌చిన్‌ ప్రాంతం కూడ చైనాలో ఉండడం కూడ చైనా స్పందనకు కారణమయ్యాయి.భారత్ తనదిగా చెప్పుకుంటోన్న అక్సాయ్‌చిన్‌ ప్రాంతం ప్రస్తుతం చైనా నియంత్రణలోనే ఉంది. మరోవైపు భారత్‌కు చెందిన అక్సాయ్ చిన్ చైనా ఆదీనంలో ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే చైనా భూభాగంలోకి భారత్ చొచ్చుకొని రావడాన్ని చైన తీవ్రంగా వ్యతిరేకిస్తుందంటూ చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. 'కొద్ది రోజుల క్రితం చేసిన చట్టాల ద్వారా చైనా సార్వభౌమత్వాన్ని భారత్ తక్కువ చేయాలని చూస్తుందంటు పేర్కోంది.. ఇది ఏ మాత్రం అమోదయోగ్యం కాదని తెలిపింది. అలాగే సరిహద్దు వివాదాలను మరింత క్షిష్టతరం చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందిచారు..

English summary
MEA asks China not to interfere in the internal matter of India,The MEA, said that India does not interfere in the internal affairs of the country and expects the same from other countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X