చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చాపర్‌లో కాకుండా కారులో మహాబలిపురంకు జిన్‌పింగ్...కారణం ఏంటి?

|
Google Oneindia TeluguNews

చెన్నై: రెండు రోజుల భారత పర్యటన కోసం చైనా అధ్యక్షుడు శుక్రవారం చెన్నైకు చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కాసేపు హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం మహాబలిపురంకు వెళ్లారు. అయితే చాపర్‌లో వెళ్లాల్సిన చైనా అధ్యక్షుడు మహాబలిపురంకు రోడ్డుమార్గం ద్వారా వెళ్లారు. చెన్నై నుంచి మహాబలిపురం 57 కిలోమీటర్లు ఉంది. ఈ మొత్తం దూరాన్ని జిన్‌పింగ్ చాపర్ ద్వారా కాకుండా రోడ్డు మార్గం ద్వారా తన హాంగ్‌కీలో వెళ్లారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మహాబలిపురంకు చేరుకున్నారు.

హాంగ్‌కీలో మహాబలిపురంకు జిన్‌పింగ్

హాంగ్‌కీ అనేది చైనాకు చెందిన చాలా విలాసవంతమైన కారు. అధికారిక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు చెందిన నేతలు ఈ లగ్జరీ కారును వినియోగిస్తారు. మాఓ జెడాంగ్ నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీకి చెందిన దేశాధ్యక్షులు అందరూ ఇదే కారును వినియోగిస్తున్నారు. చైనీస్ భాషలో హాంగ్‌కీ అంటే అర్థం ఎర్ర జెండా. ఇక మోడీతో నిన్న చర్చలు ముగిశాక అంతా తిరిగి చెన్నై చేరుకున్నారు. ఇక శనివారం మళ్లీ చైనా అధ్యక్షుడితో పాటు అతని బృందం మహాబలిపురంకు చేరుకుంటుంది. ఇక్కడే మోడీతో చర్చలు జరుపుతారు అధ్యక్షుడు జిన్‌పింగ్. ఇక మధ్యాహ్నం నేపాల్‌కు జిన్‌పింగ్ బయలుదేరి వెళతారు.

చాపర్లో అధినేతలు ప్రయాణం ఎందుకు చేయరు..?

చాపర్లో అధినేతలు ప్రయాణం ఎందుకు చేయరు..?

చైనాకు చెందిన అధినేతలు హెలికాఫ్టర్‌లో ప్రయాణాలు దాదాపుగా చేయరు. అదేదో నియమంలా పాటిస్తారని చైనా విదేశీవ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వారు కేవలం విమానాలు లేదా కార్లను మాత్రమే ప్రయాణానికి వినియోగిస్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. జీ-20 లాంటి సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో కూడా జిన్‌పింగ్ హెలికాఫ్టర్‌లో కాకుండా కారులోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపినట్లు వారు గుర్తుచేశారు.

హాంగ్‌కీలో ప్రయాణించాలని జిన్‌పింగ్ పిలుపు

హాంగ్‌కీలో ప్రయాణించాలని జిన్‌పింగ్ పిలుపు

మావో జెడాంగ్ తర్వాత అంతటి బలమైన నాయకుడిగా పేరుగాంచారు జిన్‌పింగ్. గతేడాది చైనా రాజ్యాంగంను సవరించి తాను జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగేలా చూసుకున్నారు.అప్పటి వరకు చైనా అధ్యక్షుడిగా ఒక వ్యక్తికి రెండు పర్యాయాలు మాత్రమే అయ్యే అవకాశం ఉండేది. ఆసమయంలోనే అధ్యక్షుడు హాంగ్‌కీలో ప్రయాణించాలనే అంశంపై కూడా నిర్ణయించడం జరిగింది. అంటే అమెరికా అధ్యక్షుడు ఎలాగైతే బీస్ట్ అనే క్యాడిలాక్ వాహనంలో ప్రయాణిస్తారో చైనా అధ్యక్షుడు కూడా అలాంటి ప్రత్యేకమైన కారులో ప్రయాణం చేయాలనే పరిస్థితిని తీసుకొచ్చారు జిన్‌పింగ్.

 హాంగ్‌కీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారా..?

హాంగ్‌కీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారా..?

ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో జిన్‌పింగ్ సౌత్‌ఈస్ట్ ఏషియా పసిఫిక్ దేశాల్లో పర్యటించిన సమయంలో కూడా తాను హాంగ్‌కీ కారులోనే ప్రయాణించారు. అయితే ఈ చైనీస్ బ్రాండ్‌ను పలు అంతర్జాతీయ వేదికలపై ప్రమోట్ చేసేందుకే జిన్‌పింగ్ ఇలా ప్రయాణాలు చేస్తుంటారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. హాంగ్‌కీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు ఒక సూచికగా నిలుస్తోంది. ఈ కారు 1958లో చైనా ఫస్ట్ ఆటో వర్క్స్‌ గ్రూప్ ప్రారంభించింది. చైనాలో వీఐపీలు లేదా ఇతర దేశాల నుంచి వచ్చే నాయకుల కోసం ఈ కారును వినియోగిస్తారు.

నాటి మావో జెడాన్ నుంచి నేటి జిన్‌పింగ్ వరకు...

నాటి మావో జెడాన్ నుంచి నేటి జిన్‌పింగ్ వరకు...

1970లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సాన్ చైనాలో పర్యటించిన సమయంలో మావో జెడాంగ్ హాంగ్‌కీ వాహనంను వినియోగించారు. ఇక 1990వ దశకంలో అప్పటి నాయకులు విదేశీ కార్లవైపు మొగ్గు చూపడంతో హాంగ్‌కీ బ్రాండ్ పడిపోయింది. 2012 కమ్యూనిస్ట్ పార్టీ క్యాడర్‌ సమావేశంలో ప్రసంగించిన జిన్‌పింగ్... చైనాకు చెందిన నాయకులు చైనాలో తయారైన వాహనాలను మాత్రమే వినియోగించాలని పిలుపునిచ్చారు. విదేశీ కార్లలో కూర్చుని ఫోజులు ఇవ్వడం చూసేందుకు బాగుండదని ఆ సమయంలో జిన్‌పింగ్ చెప్పారు. జిన్‌పింగ్ ఇచ్చిన పిలుపుతో ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ హాంగ్‌కీ హెచ్7 కారును 2013 నుంచి వినియోగించడం మొదలుపెట్టారు.

English summary
Visiting Chennai for his second informal summit with Prime Minister Narendra Modi on Friday, Chinese President Xi Jinping has opted to travel to tourist town Mamallapuram by road instead of a helicopter as Chinese leaders, as matter of policy, shun travel by
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X