వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దు ప్రతిష్ఠంభనపై చైనా కొత్త ప్రతిపాదన...? ట్రాప్... నమ్మే ప్రసక్తే లేదన్న భారత్...

|
Google Oneindia TeluguNews

చైనాతో ఎప్పుడు చర్చలు జరిపినా సరిహద్దులో సైన్యం ఉపసంహరణకు కట్టుబడి ఉంటామనే చెప్తుంది. అది మిలటరీ స్థాయి చర్చలైనా... దౌత్య పరమైన చర్చలైనా చైనాది ఇదే మాట. కానీ డ్రాగన్ చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదు. సరిహద్దులోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇద్దరం ఒకేసారి తప్పుకుందామని భారత్ అంటే... లేదు,ముందు మీరే ఖాళీ చేయాలని కొన్నాళ్లు వితండ వాదంతో చర్చలను ముందుకు సాగనివ్వలేదు. ఇటీవలి మిలటరీ చర్చల్లోనూ సరిహద్దులో సైన్యం ఉపసంహరణకు కట్టుబడి ఉంటామని చెప్తూనే కొత్త కొర్రీలు పెట్టింది. దీంతో చైనాను నమ్మే ప్రసక్తే లేదని భారత్ అభిప్రాయపడుతోంది.

మీషా ఘోషల్ ట్రెడిషినల్ లుక్ ట్రెండింగ్.. అందంగా ముద్దు ముద్దుగా...

చైనా కొత్త ప్రతిపాదన...

చైనా కొత్త ప్రతిపాదన...

తూర్పు లదాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఘర్షణాత్మక ప్రాంతాల్లో సైన్యం ఉపసంహరణ,శాంతిని నెలకొల్పేందుకు ఇటీవల ఇరు దేశాల మిలటరీ కమాండర్స్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాజా చర్చల్లో చైనా కొత్త కొర్రీలు ముందుకు తెచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఉన్న ఫింగర్ 1 నుంచి మొదట భారత్ తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటే... ఆ తర్వాత ఫింగర్ 8 నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని చైనా ప్రతిపాదించింది. ఆ తర్వాత దాన్ని బఫర్ జోన్‌(జన సంచారం లేని ప్రదేశం)గా ప్రకటిద్దామని చెప్పింది.

ఆ ప్రసక్తే లేదన్న భారత్...

ఆ ప్రసక్తే లేదన్న భారత్...

'చైనా ప్రతిపాదనను మేము తిరస్కరించాం. చైనా అతిక్రమణల పట్ల మేము ఉదాసీనంగా వ్యవహరించలేము. ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకూ ఏప్రిల్ ముందు వరకు ఉన్న స్టేటస్ కోని చైనా పునరుద్దరించాలని మేము కోరుతున్నాం.' అని ఓ ఆర్మీ కమాండర్ వెల్లడించారు. చైనా ప్రతిపాదనను భారత్ ఒక రకంగా ట్రాప్‌గానే భావిస్తోంది. నిజానికి ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకూ 'నో ప్యాట్రోలింగ్ జోన్' ప్రతిపాదనను భారత్ ఇదివరకే చైనా ముందు పెట్టింది. అప్పుడు కూడా ముందు భారత్ చైనా ఇవే కొర్రీలు పెట్టింది. ముందు భారత్ పాంగాంగ్ దక్షిణ తీరాన వ్యూహాత్మక శిఖరాలపై తమ స్థావరాలను ఖాళీ చేయాలని పట్టుబడింది. ఆ తర్వాత ఉత్తర తీరం నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఉపసంహరించుకుంటామని చెప్పింది. అయితే భారత్ ఆ స్థావరాలను ఖాళీ చేస్తే చైనా వంచనపూరితంగా వాటిని ఆక్రమించుకునే అవకాశం ఉందని భావించిన భారత్ ఆ ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

కొనసాగుతున్న ప్రతిష్ఠంభన...

కొనసాగుతున్న ప్రతిష్ఠంభన...

భారత్-చైనా సరిహద్దులోని తూర్పు లదాఖ్‌లో గత ఏడు నెలల నుంచి ఇరు దేశాల సైన్యం మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులైలో ఇరు దేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత సైనికులు చనిపోయారు. చైనా ఏకపక్షంగా వాస్తవాధీన రేఖ వెంబడి స్టేటస్ కోని మార్చివేయడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది.పాంగాంగ్ ఉత్తర తీరాన్ని ఆక్రమించి ఫింగర్ 8 వరకు సైన్యాన్ని మోహరించింది.మరోవైపు భారత్ పాంగాంగ్ దక్షిణ తీరంలో పాగా వేసి చైనాను ఎప్పటికప్పుడు నిలువరించే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దులో ఉద్రిక్తతలకు తెరదించి,సైన్యాన్ని ఉపసంహరించుకోవాలన్న ఎజెండాతో చర్చలు జరుగుతున్నా అవేవీ కార్యరూపం దాల్చట్లేదు.


అంజు కురియన్ క్యూట్ గ్యాలరీ.. వైరల్ అవుతున్న లవ్లీ పిక్

English summary
china proposal to disengagement rejected by india and considering it as trap
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X