వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ఈక్వేషన్స్‌కు తెరలేపుతున్న చైనా... ఆ సరిహద్దు సంగతేంటని ప్రశ్న

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా తన కుటిల బుద్ధి మరోసారి బయటపెట్టింది. కశ్మీర్ వ్యవహారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన అనధికారిక సమావేశంలో పాకిస్తాన్‌కు అండగా నిలిచిన డ్రాగన్ కంట్రీ ఆ సమయంలో ఇదే అదనుగా అక్సయ్‌చిన్ విషయాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. వాస్తవానికి ఇది లడాఖ్‌ భూభాగంలోకి వస్తుంది. కానీ బీజింగ్ దీన్ని బలవంతంగా లాక్కుంది. భారత్ జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చైనా... ద్వైపాక్షిక ఒప్పందాలకు భారత్ తూట్లు పొడించిందని ఐక్యరాజ్యసమితికి చైనా శాశ్వత ప్రతినిధి ఆరోపించారు.

భారత్ తీసుకున్న చర్యలతో ఒక్క పాకిస్తాన్‌కే నష్టం కాదని చైనాకు కూడా నష్టం వాటిల్లిందని డ్రాగన్ కంట్రీ తెగ బాధపడిపోతోంది. అందుకే ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కొద్దిరోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా లడఖ్‌పై మాట్లాడుతూ చైనాతో లైన్‌ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌కు ఎలాంటి ఇబ్బంది తలెత్తదని స్పష్టం చేశారు. గత సోమవారం భారత్ చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల మధ్య జరిగిన భేటీలో ఆర్టికల్ 370 రద్దు గురించి చైనా మంత్రి వాంగ్‌యీ ప్రస్తావించారు. అయితే ఇది భారత్‌ యొక్క అంతర్గత వ్యవహారమని జైశంకర్ తెలిపారు. అంతేకాదు ఆర్టికల్ 370 రద్దుతో అక్కడ మంచి పరిపాలన, సామాజిక ఆర్థికాభివృద్ధి నెలకొంటుందని వివరించారు.

China Puts forward its demand for AksaiChin at UNSC informal session

ఇక భారత్ చైనాల మధ్య సరిహద్దు విషయం అంశానికి వస్తే ఇరు నేతలు చాలా సామరస్యంగా ఓ ఒప్పందానికి వచ్చినట్లు జైశంకర్ తెలిపారు. 2005నాటి రాజకీయ అంశాలను, నాటి సూచనలను పరిగణలోకి తీసుకున్నట్లు జైశంకర్ తెలిపారు. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్తాన్ కొంత భూభాగాన్ని చైనాకు అప్పనంగా ఇచ్చి ఇందులో చైనాను కూడా వాటాదారుడిగా చేసింది. కశ్మీర్‌లో మానవహక్కులకు భంగం వాటిల్లుతోందని చైనా ఆరోపించింది. అయితే టిబెట్. తియానన్మెన్, క్సింజియాంగ్, హాంగ్‌కాంగ్ దేశాల్లో చైనా చేస్తున్నదేమిటని అది మానవహక్కుల ఉల్లంఘన కాదా అంటూ కొందరు మేధావులు ప్రశ్నిస్తున్నారు.

చైనా ఇప్పటికే పాకిస్తాన్‌కు మద్దుతగా నిలిచి రెండు సార్లు బొక్కబోర్లా పడింది. మొదటి సారి ఉగ్రవాది మసూద్ అజార్‌కు అండగా నిలిచి అంతర్జాతీయ సమాజంలో అభాసుపాలైన చైనా..మళ్లీ పాక్‌కు మద్దతుగా నిలిచి ఇతర దేశాల నుంచి మద్దతు తీసుకురావడంలో విఫలమైంది. అంటే ప్రపంచదేశాల్లో చైనాకు అంత విలువలేదనేని అర్థం చేసుకోవాల్సిన విషయం.

English summary
China not only supported Pakistan on the Kashmir issue at last Friday's closed-door informal session of the UN Security Council, but also raked up the status of Aksai Chin, a territory in Ladakh illegally occupied by Beijing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X