వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా దాడి వల్లే మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటన

|
Google Oneindia TeluguNews

భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కృషి , ఆయన తీసుకున్న చర్యల వల్లే జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను ఐక్కరాజ్య సమితి అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించిందని అన్నారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. కాగా పుల్వామా ఉగ్రదాడి, అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలోనే భారత దేశం తీసుకున్న చర్యల ఫలితంగానే చైనాలో మార్పులు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే ఇన్నాళ్లుగా నాన్చుతూ వచ్చిన అంశాన్ని చైనా అంగీకరించదని చెప్పారు. మసూద్ అజర్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని అందించడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.

China removed their hold because of the Pulwama terror attack

మరోవైపు దేశం విజయం సాధిస్తే అది ప్రతి ఒక్క భారతీయడి విజయంగా పరిగణించాలని అన్నారు. అయితే భారత్ సాధించిన ఈ విజయంతో విపక్షాలు మాత్రం విబేధిస్తున్నాయని అన్నారు. ఈ విజయంలో పాల్గొంటే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని భయపడుతున్నారని విమర్శించారు. అరుణ్ జైట్లీ తోపాటు కేంద్రమంత్రి నిర్మలా సితారామన్ ఢిల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

English summary
After the United Nations Security Council (UNSC) listed Jaish-e-Mohammed (JeM) chief Masood Azhar as a global terrorist, Union minister Arun Jaitley on Thursday said China finally removed their hold because of the Pulwama terror attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X