• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢిల్లీ నెత్తిన చైనా రాకెట్ ? కరోనాతో పాటు మరో డ్రాగన్ ముప్పు , ఖగోళ శాస్త్రజ్ఞుడి షాకింగ్ కామెంట్స్ !!

|

భారతదేశాన్ని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి.ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభణతో భారత్లో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటే, ఆరోగ్య సంక్షోభంతో భారతదేశం విలవిలలాడుతుంటే, మరోపక్క చైనా నుండి పెను ప్రమాదం పొంచి ఉంది అన్న సంకేతాలు భారత్ ను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.అదుపుతప్పిన చైనా రాకెట్ 'లాంగ్ మార్చ్ ఫైవ్ బి' ఇప్పుడు భారత్ లో పడే అవకాశం ఉందన్న శాస్త్రవేత్తల అంచనాలతో ఇప్పుడు ఇండియాకు మరో ప్రమాదం పొంచి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

 చైనా రాకెట్ 'లాంగ్ మార్చ్ ఫైవ్ బి' భారత రాజధాని ఢిల్లీపై పడే అవకాశాలు

చైనా రాకెట్ 'లాంగ్ మార్చ్ ఫైవ్ బి' భారత రాజధాని ఢిల్లీపై పడే అవకాశాలు

అదుపుతప్పిన చైనా రాకెట్ 'లాంగ్ మార్చ్ ఫైవ్ బి' పైన ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిసారించింది. ఇది మే 8వ తేదీ నాటికి భూమిని తాకవచ్చని అమెరికా రక్షణ శాఖ ప్రకటించడంతో రాకెట్ ఏ దేశంలో పడుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఇదే సమయంలో అమెరికాలోని హార్వర్డ్ స్మితోజియన్ ఆస్ట్రో ఫిజికల్ అబ్జర్వేటరీ ఖగోళ శాస్త్రజ్ఞుడు జోనాథన్ మెక్ డోవెల్ దీనిపై షాకింగ్ కామెంట్ చేశారు. చైనా రాకెట్ భారత రాజధాని ఢిల్లీ పైన పడే అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు.

సెకనుకు నాలుగు మైళ్ళ వేగంతో దూసుకొస్తున్న చైనా రాకెట్

సెకనుకు నాలుగు మైళ్ళ వేగంతో దూసుకొస్తున్న చైనా రాకెట్


చైనా రాకెట్ సెకను కు నాలుగు మైళ్ల వేగంతో దూసుకు వస్తుందని భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణ భాగాలలో 41 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాలలో ఎక్కడైనా లాంగ్ మార్చ్ ఫైవ్ బి కుప్ప కూలొచ్చని జోనాథన్ పేర్కొన్నారు.అయితే దానిని అదుపులోకి తీసుకుని నిర్జన ప్రదేశాలలో వైపు మళ్ళించే ప్రయత్నాల్లో చైనా నిమగ్నమై ఉండొచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ చైనా అటువంటి ప్రయత్నం చేయక పోతే మాత్రం పెను ప్రమాదం సంభవించవచ్చు అని భావిస్తున్నారు.

ఆ నగరాలపైనే పడే ఛాన్స్ .. ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్ డోవెల్

ఆ నగరాలపైనే పడే ఛాన్స్ .. ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్ డోవెల్

ఇదే సమయంలో ఒక వేళ ఢిల్లీ పై పడకుంటే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, బ్రెజిల్లోని రియో డి జెనీరియా నగరం,బీజింగ్ నగరాలపై పడే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అసలే దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కరోనా కల్లోలంతో విలవిలలాడుతుంటే చైనా రాకెట్ ఢిల్లీపై పడే అవకాశాలు ఉన్నాయి అన్న శాస్త్రజ్ఞుడి వ్యాఖ్యలు,భారత్ ను ఒక్కసారిగా షాక్ కు గురి చేశాయి. భారతదేశంపై ఎప్పుడు కుట్రలు చేసే డ్రాగన్ కంట్రీ చైనా నిర్జన ప్రదేశాల వైపు రాకెట్ ను మళ్లించి, ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా, ఏ దేశానికి హాని జరగకుండా చూస్తుందా అన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న.

చైనా రాకెట్ విషయంలో అమెరికా అసహనం, రాకెట్ శకలాలు ఎక్కడ పడతాయో తెలీక టెన్షన్

చైనా రాకెట్ విషయంలో అమెరికా అసహనం, రాకెట్ శకలాలు ఎక్కడ పడతాయో తెలీక టెన్షన్

ఇప్పటికే అమెరికా చైనా రాకెట్ భూమి వైపుకు దూసుకు వస్తున్న క్రమంలో బాధ్యత కలిగిన అంతరిక్ష ప్రవర్తన కోసం పిలుపునిచ్చింది. చైనా తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.అంతకుముందు కరోనా మహమ్మారి విషయంలోనూ చైనాను యూఎస్ టార్గెట్ చేసింది. ప్రస్తుతం రాకెట్ విషయంలోనూ చైనా తీరుపై అసహనం వ్యక్తం చేసింది.అయితే చైనా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలోనే రాకెట్ శకలాలు నాశనమైపోతాయని, దీనిపై చర్చ అవసరం లేదని చెబుతున్నా, ఖగోళ శాస్త్రజ్ఞుల తాజా వ్యాఖ్యలు భారతదేశాన్ని టెన్షన్ పెడుతున్నాయి.ఇంతకీ రేపు భూమిని తాకనున్న రాకెట్ ఎక్కడ పడుతుందో.. ఏం జరగనుందో తెలియాల్సి ఉంది

English summary
China rocket 'Long March Five B' likely to land on Indian capital Delhi . The whole world is now focused on the misguided China rocket 'Long March Five B'. With the U.S. Department of Defense announcing that it could hit Earth by May 8, the million-dollar question is which country the rocket will land on. Meanwhile, Jonathan McDowell, an astronomer at the Harvard Smithogen Astrophysical Observatory in the United States, made a shocking comments. He predicted that the Chinese rocket was likely to land over the Indian capital Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X