• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిగ్ ప్లాన్ : చైనా 'ఫైవ్ ఫింగర్స్ ఆఫ్ టిబెట్' స్ట్రాటజీ... భారతే అసలు లక్ష్యం...

|

ఓవైపు భారత్‌తో గాల్వన్ వ్యాలీలో ఉద్రిక్తతలు... మరోవైపు భూటాన్‌తోనూ వివాదాలను కొనితెచ్చుకునే ప్రయత్నం... వీటికి తోడు దక్షిణ చైనా సముద్రంలోనూ పొరుగు దేశాలతో వివాదాలు... ఇదీ చైనా తీరు. మొత్తంగా ఆసియాలోని మెజారిటీ దేశాలతో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. దీని వెనక డ్రాగన్ వ్యూహం ఒక్కటే... విస్తరణ వాదం. ఆసియా ఖండంలో తామే అత్యంత శక్తివంతులమని చాటేందుకు ఈ కుయుక్తులకు పాల్పడుతోంది. ముఖ్యంగా భారత్‌ను టార్గెట్ చేసేందుకు చైనా ఎప్పటికప్పుడు కొత్త కుట్రలు పన్నుతూనే ఉంది. భూటాన్‌తో వివాదాన్ని తెర పైకి తీసుకురావడం కూడా పరోక్షంగా భారత్‌ను టార్గెట్ చేయడమే.

భారత్ పై ఒత్తిడికి చైనా మరో వ్యూహం- తెరపైకి భూటాన్ భూభాగం -పొరుగుదేశం దీటైన జవాబు..

చైనా వివాదాస్పద ప్రకటన...

చైనా వివాదాస్పద ప్రకటన...

జూన్ 2,3 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ కౌన్సిల్ సమావేశంలో చైనా ఓ వివాదాస్పద స్టేట్‌మెంట్ ఇచ్చింది. భూటాన్ తూర్పు భాగంలోనూ తమకు సరిహద్దు వివాదం ఉందని చెబుతూ.. సాక్టెంగ్ వన్యప్రాణి సంరక్షణ ప్రాజెక్టు అభివృద్దికి జీఈఎఫ్ నిధులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రకటన భూటాన్‌ను నివ్వెరపోయేలా చేసింది. చైనా కౌన్సిల్ మెంబర్ ఇచ్చిన ఆ స్టేట్‌మెంట్‌ను తీవ్రంగా ఖండించింది. సాక్టెంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం భూటాన్ అంతర్గత భూభాగమని,దానిపై తమకే సార్వభౌమాధికారం ఉందని స్పష్టం చేసింది.

వివాదరహిత ప్రాంతంపై వివాదాలు...

వివాదరహిత ప్రాంతంపై వివాదాలు...

చైనా చేసిన ఈ వివాదాస్పద ప్రకటన భారత్‌ను కూడా కలవరపెడుతోంది. ఎందుకంటే... చైనా వివాదాస్పద భూభాగం అని పేర్కొంటున్న భూటాన్ తూర్పు భాగంలోని 650 చ.కి.మీ సాక్టెంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అరుణాచల్ ప్రదేశ్‌తో సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు ప్రాంతాన్ని చైనా 2014లో తమది పేర్కొంటూ మ్యాప్‌లో కూడా ఎక్కించింది. నిజానికి భూటాన్-చైనా మధ్య పశ్చిమ,సెంట్రల్ సెక్టార్‌లో సరిహద్దు వివాదాలున్నాయి కానీ... తూర్పు భాగంపై అసలు వివాదాలు లేనే లేవు. ఒకవేళ తూర్పు భాగంలో వివాదాలు ఉండి ఉంటే... చైనా గతంలోనే సాక్టెంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అభివృద్దికి సంబంధించి జీఈఎఫ్ నిధులపై అభ్యంతరం చెప్పి ఉండేది కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

'ఫైవ్ ఫింగర్స్ ఆఫ్ టిబెట్' స్ట్రాటజీతో..

'ఫైవ్ ఫింగర్స్ ఆఫ్ టిబెట్' స్ట్రాటజీతో..

కానీ చైనా మాత్రం భూటాన్‌తో తూర్పు భాగంలోనూ చాలా కాలంగా వివాదం నెలకొందని వితండ వాదన వినిపిస్తోంది. దీనిపై టిబెటన్ అడ్మినిస్ట్ లోబ్‌సంగ్ సంగాయ్ మాట్లాడుతూ.. చైనా ఫైవ్ ఫింగర్స్ ఆఫ్ టిబెట్ స్ట్రాటజీతో గత 60 ఏళ్లుగా భారత్‌ను హెచ్చరిస్తోందని చెప్పారు. టిబెట్‌ను ఆక్రమించిన సమయంలో మావో జెడాంగ్,ఇతర చైనీస్ నాయకులు మాట్లాడుతూ.. 'టిబెట్ అనేది మన అరచేతి లాంటిది. దాన్ని మనం కచ్చితంగా ఆక్రమించుకోవాలి. ఆ తర్వాత మిగతా ఐదు ఫింగర్స్‌ను కూడా ఆక్రమించుకోవాలి. అందులో మొదటి లదాఖ్,మిగిలినవి నేపాల్,భూటాన్,సిక్కీం,అరుణాచల్ ప్రదేశ్' అని పేర్కొనట్లుగా చెప్పారు.

మావో జెడాంగ్ ప్రతిపాదించినట్లుగా ప్రచారంలో..

మావో జెడాంగ్ ప్రతిపాదించినట్లుగా ప్రచారంలో..

1940ల్లో మావో జెడాంగ్ ఈ ప్రతిపాదన చేసినట్లు... ఆయన ప్రసంగాల్లో పేర్కొనట్లుగా చెబుతారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్పష్టత మాత్రం లేదు. చైనీస్ పబ్లిక్ స్టేట్‌మెంట్స్‌లోనూ ఎక్కడా దీనిపై ప్రస్తావన లేదు. ఆ ప్రతిపాదన ప్రకారం... టిబెట్ అనేది చైనా కుడి చేతికి అరచేయి లాంటిది. లదాఖ్,నేపాల్,సిక్కీం,భూటాన్,అరుణాచల్ ప్రదేశ్ అనేవి దానికి ఉండే ఐదు వేళ్ల లాంటివి. వీటిని భారత్ ఆక్రమించుకుందని.. ఎప్పటికైనా భారత్ నుంచి వీటిని విముక్తం చేస్తామని చైనీస్ అధికారులు గతంలో టిబెట్‌లో ప్రకటించారు కూడా.

భారత్‌ను టార్గెట్ చేసేందుకే...

భారత్‌ను టార్గెట్ చేసేందుకే...

చైనా ఫైవ్ ఫింగర్స్ ఆఫ్ టిబెట్ స్ట్రాటజీ కోణంలో చూస్తే... భూటాన్‌తో చైనా వివాదం భారత్‌ను టార్గెట్ చేసేందుకే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా భూటాన్-చైనా మధ్య మూడో దేశం జోక్యం చేసుకోవద్దని చెప్పడం పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించినదే అన్న విషయం స్పష్టమవుతూనే ఉంది. అందుకే, మొదటి నుంచి భూటాన్‌ రక్షణకు హామీ ఇస్తూ వస్తున్న భారత్.. ఈ విషయంలో మరింత అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తోంది.

  TikTok Pro App టిక్‌టాక్ కొత్త వెర్షన్ నా ? Download చేసారో సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి డేటా !
  అటు భూటాన్‌తో,ఇటు భారత్‌తో...

  అటు భూటాన్‌తో,ఇటు భారత్‌తో...

  ఓవైపు భూటాన్‌తో సరిహద్దు వివాదాలు రెచ్చగొడుతూనే.. మరోవైపు గాల్వన్ వ్యాలీలో భారత్‌తో చైనా ఘర్షణలకు దిగింది. జూన్ 15వ తేదీ రాత్రి ఇరు దేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైన్యం అమరులయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకూ గాల్వన్‌లో శాంతి నెలకొల్పేందుకు భారత్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ సైతం లదాఖ్‌లోని లేహ్‌లో పర్యటించారు. ఇటీవలే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రితో దాదాపు 2గంటలు ఫోన్‌లో మాట్లాడారు. దీంతో గాల్వన్ నుంచి సైన్యం ఉపసంహరణకు చైనా ఒప్పుకుంది. అయితే ఆ మాటపై డ్రాగన్ నిలబడుతుందా లేదా అన్న దాన్ని భారత్ నిశితంగా గమనిస్తూనే ఉంది.

  English summary
  President of the Central Tibetan Administ Lobsang Sangay recently spelt out China's territorial ambitions. He said they have been warning India for 60 years about China's Five Fingers of Tibet strategy.Sangay said, “When Tibet was occupied, Mao Zedong and other Chinese leaders said, ‘Tibet is the palm which we must occupy, then we will go after the five fingers’. The first finger is Ladakh. The other four are Nepal, Bhutan, Sikkim and Arunachal Pradesh."
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more