• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అడ్డంగా దొరికిన చైనా - కిడ్నాపైన భారతీయులు డ్రాగన్ చెరలోనే - విడుదలపై కేంద్ర మంత్రి ప్రకటన

|

''ఏంటీ? ఐదుగురు భారతీయుల్ని మేం కిడ్నాప్ చేశామా? అది కూడా అరుణాచల్ ప్రదేశ్ కు చెందినవాళ్లనా? నాన్సెన్స్.. అసలీ వ్యవహారం గురించి మాకేమీ తెలీదు. అయినా, అరుణాచల్ ప్రదేశ్ ను ఇండియాలో భాగంగా మేం చూడట్లేదు. అది ముమ్మాటికీ టిబెట్ లో అంర్భాగం'' అంటూ ప్రేలాపనలు చేసిన చైనా ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. కిడ్నాపైన ఐదుగురు భారతీయులూ డ్రాగన్ చెరలోనే ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మంగళవారం కీలక ప్రకటన చేశారు.

బిగ్గరగా మాట్లాడినా కరోనా వ్యాప్తి - అసెంబ్లీ స్పీకర్ అనూహ్య వ్యాఖ్యలు - ఆటాడుకున్న ఎమ్మెల్యేలు

అసలేమైందంటే..

అసలేమైందంటే..

అరుణాచల్ ప్రదేశ్ లో చైనా సరిహద్దును ఆనుకుని ఉన్న అప్పర్ సుబాన్సిరి జిల్లాకు చెందిన ఐదుగురు యువకుల్ని గత శుక్రవారం చైనా సైన్యం కిడ్నాప్ చేసింది. జిల్లాలోని నాచో ప్రాంతంలోని టగిన్ తెగకు చెందిన ఏడుగురు యువకులు వేటకు వెళ్లగా.. వాళ్లను చైనా సైన్యం అడ్డుకుంది. ఇద్దరు యువకులు ఎలాగోలా అక్కణ్నుంచి తప్పించుకోగా.. టోచ్ సింగ్‌కమ్, ప్రసత్, రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తను బకెర్, ఎంగ్రూ దిరి అనే ఐదుగుర్ని చైనా సైన్యం బందీలుగా తీసుకుంది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాంగ్‌ ఎరింగ్‌ ట్విటర్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేయడంతో డ్రాగన్ దురాగతం ప్రపంచానికి తెలిసింది.

హాట్ లైన్ ద్వారా సమాచారం..

హాట్ లైన్ ద్వారా సమాచారం..

ఐదుగురు భారతీయుల కిడ్నాప్ వ్యవహారంపై భారత్, చైనా ఆర్మీల మధ్య శుక్రవారం నుంచి హాట్ లైన్ లో సంవాదాలు జరుగుతున్నాయి. యువకుల అదృశ్యం గురించి తమకు తెలీదని చెబుతూ వచ్చిన చైనా.. మంగళవారం సడెన్ గా మరో ప్రకటన చేసింది. ఆ ఐదుగురూ తమ దగ్గరే ఉన్నారని, దారి తప్పిపోయి తిరుగుతున్న వాళ్లను చైనా సైనికులు గుర్తించారని హాట్ లైన్ లో భారత్ కు సమాచారం చేరవేసింది. కిడ్నాప్ కు పాల్పడిందేకాక, నిన్నటి వరకు అసలా సంగతే తెలీదని బుకాయించిన చైనా ఇప్పుడా ఐదుగురూ తమ వద్దే ఉన్నారని ఒప్పుకోవడంతో అడ్డంగా దొరికినట్లయింది.

 అప్పగించే ప్రక్రియ..

అప్పగించే ప్రక్రియ..

అదృశ్యమైన ఐదుగురు అరుణాచల్ ప్రదేశ్ యువకులు చైనా సైన్యం ఆధీనంలో ఉన్నట్లు తెలిసిందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మీడియాకు చెప్పారు. భారత సైన్యం హాట్‌లైన్ సందేశానికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) స్పందించిందని,, తప్పిపోయిన యువకులను వారి వైపు భూభాగంలో కనుగొన్నట్లు చైనా సైనికులు ధృవీకరించారని, వాళ్లను తిరిగి భారత్‌కు అప్పగించే ప్రక్రియ కూడా ప్రారంభమైందని, ఈ మేరకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టినట్లు భారత సైన్యానికి పీఎల్‌ఏ చెప్పిందని కిరెన్ రిజిజు వివరించారు.

కస్టమర్ల చేతిలో క్యాబ్ డ్రైవర్ హతం -'జైశ్రీరాం'అనాలంటూ చంపేశారు-ఆడియో వైరల్-పోలీసుల వెర్షన్ వేరు

English summary
China's People's Liberation Army has confirmed that five youths missing from Arunachal Pradesh have been found by them and their handing over process to Indian authorities is being worked out, Union minister Kiren Rijiju said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X