వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు చెక్ పెట్టేందుకే బడ్జెట్ పెంపు - డ్రాగన్ చెప్పేదొకటి, చేసేది మరోటి: రాజ్యసభలో రాజ్‌నాథ్

|
Google Oneindia TeluguNews

''అనేక దశాబ్దాలుగా చైనా తన సరిహద్దు ప్రాంతాలను విస్తరించుకుంటూ పోతున్నది. ఆ క్రమంలోనే వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)ని గుర్తించబోమంటూ భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నది. సరిహద్దు వెంబడి బలగాల మోహరింపుతోపాటు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల నిర్మాణాలు సైతం చేపట్టింది. చైనాకు చెక్ పెట్టేందుకు మనం కూడా మునుపటి కంటే రెట్టింపు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు పెంచి, ధీటుగా నిలబడ్డాం'' అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

చైనా కిరాతకం: 200 రౌండ్ల కాల్పులు - ఫింగర్ 4 వద్ద ఘటన -చుషూల్ కంటే డేంజరస్ - మాస్కో డీల్‌కు ముందుచైనా కిరాతకం: 200 రౌండ్ల కాల్పులు - ఫింగర్ 4 వద్ద ఘటన -చుషూల్ కంటే డేంజరస్ - మాస్కో డీల్‌కు ముందు

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత, తూర్పు లదాక్ లో అనూహ్య ఘటనలు, సైనిక చర్చలు తదితర అంశాలపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. చైనా దురాక్రమణ యత్నాలు, కవ్వింపు చర్యలు రోజురోజుకూ పెరుగుతుండటం, డ్రాగన్ ను నియంత్రించడంలో మోదీ సర్కారు ఫెయిలైందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యంలో రాజ్ నాథ్ ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది.

 China says one thing, does the opposite, it disturbs status quo: Rajnath Singh in Rajya Sabha

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 'చైనా సరిహద్దు' అంశంపై చర్చకు నో చెప్పిన కేంద్రం.. రక్షణ మంత్రి చేత సుమోటోగా ఉభయసభల్లో ప్రకటన చేయించింది. సరిహద్దు అంశంపై రెండ్రోజుల కిందట లోక్ సభలో స్టేట్మెంట్ ఇచ్చిన రాజ్ నాథ్.. గురువారం రాజ్యసభలోనూ దాదాపు అవే మాటలు రిపీట్ చేశారు. చెప్పేదొకటి, చేసేది మరోటి అన్నట్లుగా చైనా వ్యవహరిస్తున్నదన్నారు.

చైనాతో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధం - ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన - ఎలా దెబ్బకొడతారంటే..చైనాతో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధం - ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన - ఎలా దెబ్బకొడతారంటే..

వివిధ ద్వైపాక్షిక తీర్మానాలకు, 1993, 1996లో చేసుకున్న ఒప్పందాలకు వ్యతిరేకంగా సరిహద్దుల్ని మార్చేందుకు చైనా నిత్యం ప్రయత్నిస్తున్నదని, తద్వారా సరిహద్దులో అశాంతిని రాజేస్తున్నదని రాజ్ నాథ్ తెలిపారు. అయితే, డ్రాగన్ ప్రయత్నాలపై భారత బలగాలు నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ధీటుగా సమాధానం ఇస్తున్నాయన్నారు. సరిహద్దులో శాంతి కోసం భారత్ కట్టుబడి ఉన్నప్పటికీ, చైనా అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు.

English summary
Defence Minister Rajnath Singh accused China of failing to respect bilateral pacts as he pinned the blame on China for the ongoing crisis in Ladakh. Speaking on the floor of the Rajya Sabha on Thursday, Rajnath Singh said, The amassing of the troops by China goes against the 1993 & 1996 Agreements. Respecting and strictly observing Line of Actual Control is the basis for peace and tranquility in the border areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X