వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్ఏసీ దాటిన చైనా జవాను: ఖాళీ పెన్ డ్రైవ్, మొబైల్, స్లీపింగ్ బ్యాగ్..

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తూర్పు లడాఖ్ వద్ద బలగాల మొహరింపు కంటిన్యూ అవడంతో పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. అయితే వాస్తవ నియంత్రణ రేఖ దాటి ఓ చైనా సైనికుడు భారత భూభాగంలో వచ్చాడు. దీంతో ఉత్కంఠ నెలకొంది.

అతని వద్ద ఖాళీగా ఉన్న పెన్ డ్రైవ్ కూడా ఉంది. దీంతో మరింత అనుమానాలు వస్తున్నాయి. మొబైల్ ఫోన్, స్లీపింగ్ బ్యాగ్ కూడా ఉంది అని 'ఆజ్ తాక్' రిపోర్ట్ చేసింది. ఇప్పుడే కాదు ఈ నెల 19వ తేదీన కూడా ఆర్మీ సిబ్బంది నిలిపివేశారు. అతనివద్ద చైనా మిలిటరీ అని ధృవీకరిచే పత్రం ఉంది అని భారత భద్రతా దళాలు పేర్కొన్నాయి. అతనిని డెమ్‌చాక్ వద్ద పట్టుకున్నామని వెల్లడించాయి.

China soldier caught in Demchok had empty pen drive, sleeping bag

జవాను.. కార్పొరల్ వాంగ్‌ను భారత ఆర్మీ సిబ్బంది ప్రశ్నించారు. అతని అప్పగింతకు సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటామని అధికారులు తెలిపారు. చైనా సైనికుడికి ఆక్సిజన్ అందించామని.. ఆహారం ఇచ్చి.. వెచ్చని దుస్తులు అందజేసి, వైద్యం సాయం చేశామని పేర్కొన్నారు. ఎత్తులో కఠినమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అతను ఉన్నాడని.. సాయం చేశామని పేర్కొన్నారు.

అయితే తప్పిపోయిన సైనికుడు కార్పొరల్ వాంగ్ గురించి చైనా సైనికుల నుంచి తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. అప్పగింతకు సంబంధించి ఫార్మాలిటీ పూర్తిచేసి.. ఇస్తామని పేర్కొన్నారు. తూర్పు లడాఖ్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాలను మొహరించడంతో.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

English summary
China Army soldier caught on the Indian side of the Line of Actual Control in Ladakh was carrying an empty pen drive, a mobile phone and a sleeping bag with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X