వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాల్వాన్‌ ఘటనలో చైనా సైనికుడి మృతి..?: సమాధి ఫోటో, నెటిజన్ల కామెంట్లు, స్పందించని చైనా..

|
Google Oneindia TeluguNews

తూర్పు లడాఖ్‌లో గల గాల్వాన్ లోయల్ భారత్-చైనా దళాల మధ్య జూన్ 15వ తేదీన ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే కల్నల్ సంతోష్ సహా 20 మంది భరతమాత ఒడిలోకి చేరిపోయారు. అటు చైనా సైనికులు కూడా చనిపోయారనే వార్తలు వెలువడ్డ.. దానిని ఆ దేశం ఖండించింది. ఆధారాలు కూడా ఏమీ బయటకు రాకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదా అని అనుకున్నారు.

చైనా సోషల్ మీడియాలో ఓ ఫోటో తిరుగుతోంది. దీంతో చైనా సైనికులు కూడా చనిపోయారని అర్థమవుతోంది. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఫోటో ఫేక్ అని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరికొందరు నిజమేనని కామెంట్స్ చేస్తున్నారు. కానీ దీనిపై చైనా అధికారులు మాత్రం స్పందించలేదు. చైనా సోషల్ మీడియా వెయ్ బో లో తిరుగుతోన్న ఫోటో ఆ దేశ సైనికుడిదని తెలుస్తోంది. చెక్ షియాంగ్రాంగ్‌కి చెందిన సైనికుడిది అని రాసి ఉంది. ఎందుకు చనిపోయారనే అంశంపై మాండరిన్ భాషలో కనిపిస్తోంది.

china soldier dead in galwan clash..? photo viral in social media

Recommended Video

India-China Face Off : సరిహద్దు వద్ద China దుందుడుకు చర్యలు ,5G Network ఏర్పాటుకు ప్లాన్ !

ఫుజియాన్‌లో గల పింగ్నాన్‌కి చెందిన 69316 యూనిట్‌కి చెందిన సైనికుడు చెన్ షియాంగ్రాంగ్ సమాధి అని ఉంది. ఈ జూన్‌లో భారత సరిహద్దులో జరిగిన ఘర్షణలో చనిపోయాడని ఉంది. సైనికుడి మరణాన్ని కేంద్ర సైనిక కమిషన్ స్మరించుకుంటోంది అని కనిపిస్తోంది. ఈ శిలను ఆగస్ట్ 5వ తేదీన ఏర్పాటు చేసినట్టు ఫోటో ద్వారా తెలుస్తోంది. దక్షిణ షిన్ జియాంగ్ వద్ద సమాధి ఉన్నట్టు కనిపిస్తోంది. జూన్ 5వ తేదీన ఘర్షణ జరగగా.. 2 నెలల తర్వాత సమాధి ఏర్పాటు చేసి ఉంటారు. ఫోటోకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్ కాగా.. చైనా అధికారులు మాత్రం స్పందించలేదు.

English summary
China's PLA soldier named "Chen Xiangrong" who killed in Galwan Valley clash at LAC near Ladakh with India'n Army has came out even though CCP hide their information and identities for public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X