• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌పై బీజేపీ బిగ్ బాంబ్... చైనా నుంచి విరాళాలు... సంచలన ఆరోపణలు..

|

ప్రధాని నరేంద్ర మోదీ చైనా దూకుడుకు లొంగిపోయి భారత భూభాగాన్ని వదిలిపెట్టారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతకొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సరిహద్దు విషయాల్లో రాజకీయం వద్దంటూ నిన్న మొన్నటిదాకా రాహుల్ నోటికి తాళం వేసేందుకు ప్రయత్నించిన బీజేపీ.. తాజాగా పదునైన అస్త్రాన్ని వదిలింది. లొంగిపోయింది తాము కాదని... ఒకప్పుడు చైనా ఇచ్చిన విరాళాలు తీసుకుని వారికి మేలు చేసేలా వ్యవహరించింది కాంగ్రెస్‌ పార్టీయేనని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెర పైకి కొత్త అంశాన్ని తీసుకొచ్చారు.

అప్పటి వార్షిక రిపోర్టులో...

అప్పటి వార్షిక రిపోర్టులో...

2005-06 సంవత్సరంలో సోనియా గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ ఫౌండేషన్‌కు చైనా ఎంబసీ నుంచి నిధులు వచ్చాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. సాధారణ దాతల జాబితాలోనే దీన్ని కూడా చేర్చినట్టు చెప్పారు.రాజీవ్ ఫౌండేషన్‌కు సంబంధించిన అప్పటి వార్షిక రిపోర్టు ఆధారంగానే ఈ విషయం చెబుతున్నట్టుగా పేర్కొన్నారు.

అది నిజం కాదా...?

అది నిజం కాదా...?

'అప్పటి యూపీఏ ప్రభుత్వం చైనా నుంచి లంచం తీసుకుందా...? ఆ విరాళాలు తీసుకున్న తర్వాతే చైనాకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా భారత్‌తో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని రాజీవ్ ఫౌండేషన్ సిఫారసు చేసిన మాట నిజం కాదా..?' అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. చైనా నుంచి తీసుకున్న ఆ విరాళాలను ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా పేర్కొనలేదని ఆరోపించారు. చైనా నుంచి డబ్బు తీసుకున్నారో లేదో... తీసుకుంటే ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీని ఆయన డిమాండ్ చేశారు.

చైనాతో రహస్య ఒప్పందం....

చైనాతో రహస్య ఒప్పందం....

2008లో చైనాతో కాంగ్రెస్ రహస్యం ఒప్పందం చేసుకుందని కూడా బీజేపీ ఆరోపించింది. అప్పట్లో చైనా ఎంబసీ అధికారులతో రాహుల్ గాంధీ,సోనియా గాంధీ సమావేశమయ్యారని చెప్పింది. ఇందిరా హయాంలో విధించిన ఎమర్జెన్సీపై కూడా రవిశంకర్ ప్రసాద్ పలు ఆరోపణలు చేశారు. అప్పట్లో ఇందిరా గాంధీ రాయ్ బరేలీ నుంచి ఎన్నికవగా... అధికార దుర్వినియోగంతో ఆమె గెలుపొందారన్న ఆరోపణలతో అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నికను పక్కనపెట్టిందని గుర్తుచేశారు. దీంతో కేవలం తన ప్రధాని పీఠాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇందిరా దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారని ఆరోపించారు.

ఇందిరా ఎమర్జెన్సీపై కేంద్రమంత్రి ఫైర్...

ఇందిరా ఎమర్జెన్సీపై కేంద్రమంత్రి ఫైర్...

ఈరోజు మనం జూన్ 25,1975న విధించిన ఎమర్జెన్సీ నాటి క్రూర పరిస్థితులను గుర్తుచేసుకుంటున్నామని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఎమర్జెన్సీ పీరియడ్‌లో జేపీ నారాయణ్,అటల్ బిహారీ వాజ్‌పెయ్,చంద్రశేఖర్,ఎల్‌కె అద్వానీ,జార్జ్ ఫెర్నాండెజ్ వంటి నేతలను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఆఖరికి మీడియాను,న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టలేదని... కాంగ్రెస్ ఏది అనుకుంటే అది చేసిందని ఆరోపించారు.

  China India Stand Off : Amit Shah And Rahul Gandhi ట్విట్టర్ వార్
  ఆరోపణలను కొట్టిపారేసిన కాంగ్రెస్..

  ఆరోపణలను కొట్టిపారేసిన కాంగ్రెస్..

  మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపణలను కొట్టిపారేసింది. కేవలం చైనాతో ఘర్షణలు,ఉద్రిక్తతల నుంచి భారతీయుల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్‌పై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. అప్పట్లో చైనా ఎంబసీ నుంచి అందుకున్న విరాళం నిష్పక్షపాతంగా జరిగిందేనని... వెబ్ సైట్‌లో అన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వివేకానంద ఫౌండేషన్ లాంటి సంస్థలు కూడా వివిధ మార్గాల ద్వారా విరాళాలు స్వీకరించాయని.. అంతమాత్రాన ఆ సంస్థలను దేశ ద్రోహుల జాబితాలో చేర్చలేమని బదులిచ్చింది.

  English summary
  As Congress allegation of the government "surrendering" India to China has intensified, the BJP has hit back with a strong political allegation -- that the Chinese are funding the Congress. The BJP has accused the Rajiv Gandhi Foundation of receiving donations from the Chinese embassy in India. The party alleges that these donations were made in 2005-06.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more