వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

+86తో జాగ్రత్త! వాట్సాప్‌ గ్రూపులపై చైనా హ్యాకర్ల నజర్, భారత ఆర్మీ హెచ్చరిక

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో వాట్సాప్‌ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని భారత ఆర్మీ హెచ్చరించింది. భారత యూజర్లే లక్ష్యంగా చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు వాట్సాప్‌ను హ్యాక్‌ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను కూడా పోస్టు చేసింది.

'చైనీయులు డిజిటల్‌ ప్రపంచంలోకి కూడా చొచ్చుకు వస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి..' అని భారత ఆర్మీకి చెందిన అడిషనల్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇంటర్‌ఫేస్‌(ఏడీజీపీఐ) ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

whatsapp

వాట్సాప్‌ గ్రూప్‌లను హ్యాక్‌ చేసి వివరాలను దొంగలిస్తున్నట్లు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. +86తో ప్రారంభమయ్యే నంబరు ఏదైనా గ్రూప్‌లో చేరితో అటువంటి నంబర్లతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అంతేగాక మొబైల్‌ నంబర్లు మార్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని, పాత సిమ్‌ను పూర్తిగా పనిచేయకుండా విరగ్గొట్టాలని స్పష్టం చేశారు.

గతంలోనూ చైనా హ్యాకర్ల గురించి ఆర్మీ కొన్ని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు కొన్ని యాప్‌లను ఉపయోగించవద్దని, వాటిని చైనీయులు హ్యాక్‌ చేస్తున్నారని హెచ్చరికలు జారీ చేసింది.

English summary
The Indian Army on Sunday released a video accusing Chinese hackers of targeting users in India via WhatsApp. The video, urging people to use the social messenger application safely, comes about four months after the Army had warned soldiers posted along the Line of Actual Control (LAC) against using a host of applications, including WhatsApp. Tweeting from the Indian Army’s official handle, the Additional Directorate General of Public Interface (ADGPI) said the Chinese were penetrating the digital world. “The Chinese use all kinds of platforms to penetrate your digital world. WhatsApp groups are a new way of hacking into your system. Chinese numbers starting with +86 barge into your groups and start extracting all the data,” a video tweeted by the ADGPI said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X