వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త మృతిని బ్రేకింగ్ న్యూస్‌గా చదివిన యాంకర్: చైనా మీడియా ప్రశంసలు

తన భర్త చనిపోయినా విధి నిర్వహణలో అంకితభావంతో వ్యవహరించిన చత్తీస్‌గఢ్ న్యూస్ యాంకర్ సుప్రీత్ కౌర్‌పై చైనా మీడియా ప్రశంసలు కురిపించింది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్/రాయ్‌పూర్: తన భర్త చనిపోయినా విధి నిర్వహణలో అంకితభావంతో వ్యవహరించిన చత్తీస్‌గఢ్ న్యూస్ యాంకర్ సుప్రీత్ కౌర్‌పై చైనా మీడియా ప్రశంసలు కురిపించింది. విధి నిర్వహణ పట్ల ఆమెకు ఉన్న విధేయత నిరుపమానమని ఛత్తీస్‌గఢ్‌లోని ఐబీసీ-24 ఛానెల్‌లో పని చేస్తున్న సుప్రీత్‌ను పేర్కొంది.

విషయం తెలిసినా...: భర్త మృతినే బ్రేకింగ్ న్యూస్‌గా చదివిన న్యూస్ యాంకర్ విషయం తెలిసినా...: భర్త మృతినే బ్రేకింగ్ న్యూస్‌గా చదివిన న్యూస్ యాంకర్

చైనాకు చెందిన పీపుల్స్‌ డైలీ, చైనా డైలీ, గ్లోబల్‌ టైమ్స్‌, షింగ్జువా న్యూస్‌ ఏజెన్సీతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు ఆమె గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఐబీసీ-24 ఛానెల్‌లో పనిచేస్తున్న సుప్రీత్‌కౌర్‌ వార్తలు చదువుతుండగా బులిటెన్‌ మధ్యలో కారు ప్రమాదం గురించి బ్రేకింగ్‌ న్యూస్‌ వచ్చింది.

anchor

ఆ కారు ప్రమాదంలో తన భర్త మృతి చెందిన విషయం ఆమెకు తెలిసినప్పటికీ బాధను దిగమింగుకొని, విధి నిర్వహణలో అంకితభావంతో బులిటెన్‌ను పూర్తి చేశారు. ఆమె హృదయవిదారక గాథ అందర్నీ కంటతడి పెట్టించింది. వృత్తి పట్ల ఆమెకు ఉన్న చిత్తశుద్ధిని చైనా మీడియా కీర్తించింది.

వార్తలు చదివే టైంలో.. నోరు తెరిచి: న్యూస్ రీడర్ ఉద్యోగం ఉడిందివార్తలు చదివే టైంలో.. నోరు తెరిచి: న్యూస్ రీడర్ ఉద్యోగం ఉడింది

ఆమె వార్తలు చదివిన వీడియోను చైనా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. పలువురు నెటిజన్లు ఆమెకు ఉద్యోగం పట్ల ఉన్న నిబద్ధతను కొనియాడుతున్నారు.

సుప్రీత్ కౌర్ తన వృత్తిని దైవంలా భావిస్తున్నారని, సుప్రీత్ గాథ వింటుంటేనే ఏడుపొస్తోందని, సుప్రీత్ చాలా ధైర్యవంతురాలని, సుప్రీత్‌ మనోధైర్యానికి సెల్యూట్... అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. వేలాది మంది చైనీయులు ఆమెను ప్రశంసిస్తున్నారు.

English summary
Thousands of Chinese have praised the composure of Indian television anchor Supreet Kaur who learnt about her husband’s death in a road accident while talking to a reporter on live television but continued reading the news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X