• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

1000 కోట్ల స్కాం: చైనా జాతీయుడు అరెస్ట్, అన్ని నకిలీవే, భారత యువతిని మోసం చేసి పెళ్లి

|

న్యూఢిల్లీ: మనీలాండరింగ్, నకిలీ చైనా కంపెనీల కోసం హవాలా కార్యకలాపాలు చేస్తున్న లువో సాంగ్ అనే చైనా జాతీయుడ్ని మంగళవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంతకుముందు ఇతడ్ని గూఢచర్యం ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.

ఐటీ డిపార్ట్‌మెంట్ ఎలా పట్టుకుంది..?

ఐటీ డిపార్ట్‌మెంట్ ఎలా పట్టుకుంది..?

చార్లీ పెంగ్‌గా నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేసుకున్న లువో సాంగ్‌ను 2018 సెప్టెంబర్‍‌లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిపై చైనాకు గూఢచర్యం చేస్తున్నాడని, మనీలాండరింగ్, హవాలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే అభియోగాలున్నాయి. అయితే, ఆ తర్వాత కోర్టు ద్వారా అతడు విడుదలయ్యాడు.

కాగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం మేరకు మనీలాండరింగ్ వ్యవహారంలో చైనా పాత్రపై ఐటీ శాఖ అధికారులు ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్ తోపాటు 21 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దర్యాప్తులో లువో సాంగ్ పేరు వెలుగులోకి వచ్చింది. 21 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన ఐటీ అధికారులు చివరకు లువో సాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు.

హవాలా కార్యకలాపాల్లో కీలక వ్యక్తి.. 1000 కోట్ల స్కాం

హవాలా కార్యకలాపాల్లో కీలక వ్యక్తి.. 1000 కోట్ల స్కాం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) ప్రకారం.. రూ. 300 కోట్ల చైనా కంపెనీల హవాలా కార్యకలాపాల కోసం లువో సాంగ్.. 8-10 బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నాడు. బంధన్ బ్యాంక్, ఐసీఐసీఐ ఉద్యోగుల సహకారంతో ఇతడు హవాలా ద్వారా రోజువారీగా 3 కోట్ల నగదును తరలించాడు. ఇతడు 40కిపైగా బ్యాంకు ఖాతాలను కలిగివుండటం గమనార్హం. ఇతడికి సహకరించిన బ్యాంకు ఉద్యోగులను కూడా తనిఖీ చేశారు అధికారులు. సుమారు రూ. 1000 కోట్ల విలువైన స్కాంగా దీన్ని గుర్తించారు. చైనాకు చెందిన సబ్సిడరీ కంపెనీలను ఉపయోగించి ఈ వ్యవహారాలను నడిపిస్తున్నట్లు తేల్చారు.

చిరునామాలు మారుస్తూ..

చిరునామాలు మారుస్తూ..

తరచుగా తన చిరునామాలను చేస్తూ.. లువో సాంగ్ ఈ కుంభకోణాన్ని మూడేళ్లుగా కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంతకుముందు ద్వారాకాలో ఉన్న ఇతడు.. ఇప్పుడు ఫేస్-5, డీఎల్ఎఫ్ గుర్గామ్‌లో ఉంటున్నాడు. విదేశీ హవాలా కార్యకలాపాల్లో హాంగ్‌కాంగ్, యూఎస్ డాలర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు.

రోజుకు 100 కోట్ల హవాలా..

రోజుకు 100 కోట్ల హవాలా..

‘చైనా వ్యక్తుల ఆదేశాల మేరకు.. వివిధ డమ్మీ ఎంటిటీలలో 40 కి పైగా బ్యాంకు ఖాతాలు సృష్టించబడ్డాయి, కాలక్రమేణా రూ .1000 కోట్లకు పైగా క్రెడిట్లలోకి ప్రవేశించాయని శోధన చర్య వెల్లడించింది. చైనా కంపెనీ అనుబంధ సంస్థ, దాని సంబంధిత సంస్థలు.. భారతదేశంలోని రిటైల్ షోరూమ్‌ల వ్యాపారాలను ప్రారంభించడానికి షెల్ ఎంటిటీల నుండి 100 కోట్ల రూపాయల బోగస్ అడ్వాన్స్‌లు స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా, హవాలా లావాదేవీలకు సంబంధించి పత్రాలను దోషులుగా తేల్చడం, బ్యాంక్ ఉద్యోగులు, చార్టర్డ్ అకౌంటెంట్ల చురుకైన ప్రమేయంతో డబ్బును లాండరింగ్ చేయడం దర్యాప్తు ఫలితంగా కనుగొనబడింది. హాంకాంగ్, యుఎస్ డాలర్లతో సంబంధం ఉన్న విదేశీ హవాలా లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా కనుగొనబడ్డాయి "అని సిబిడిటి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

  Women Army At IND-PAK Loc, POK కు అత్యంత చేరువగా మహిళా సైనికులు ! || Oneindia Telugu
  నకిలీ డాక్యుమెంట్లు.. మోసం చేసి భారత యుతిని పెళ్లాడాడు..

  నకిలీ డాక్యుమెంట్లు.. మోసం చేసి భారత యుతిని పెళ్లాడాడు..

  ఆదాయపు పన్ను శాఖ.. లుయో సాంగ్ వద్ద నుంచి రెండు నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పాన్ కార్డు, నకిలీ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుంది. కాగా, చార్లీ పెంగ్ పేరిట మొదటి ఆధార్ కార్డు జారీ చేయబడింది. ఆధార్ కార్డులో ఇచ్చిన చిరునామా సెక్టార్ 19, ద్వారకా, ఢిల్లీ. రెండవ ఆధార్ కార్డు చార్లీ పెంగ్ పేరిటే ఉంది, కాని ఇచ్చిన చిరునామా మణిపూర్ కావడం గమనార్హం. అంతేగాక, 40 ఏళ్ల చైనా జాతీయుడు లువో సాంగ్‌కు గౌహతిలో జారీ చేసిన భారతీయ పాస్‌పోర్ట్ కూడా ఉంది. చార్లీ పెంగ్ పేరును కలిగి ఉన్న అతని వద్ద నుండి పాన్ కార్డు కూడా స్వాధీనం చేసుకుంది. కాగా, అధికారులు తెలిపిన దాని ప్రకారం, చార్లీ పెంగ్ నిజమైన గుర్తింపు లువో సాంగ్. అతను చైనా జాతీయుడు, టిబెట్‌లోని లాసాకు చెందినవాడు. అతని ప్రస్తుత చిరునామా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉంది.

  పాస్‌పోర్టు కోసం భారతీయ యువతిని పెళ్లాడాడు..

  భారతీయ పాస్‌పోర్ట్‌ను పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి లువో సాంగ్ ఇంతకుముందు ఒక భారతీయ యువతిని వివాహం చేసుకున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది. అతని భార్య మిజోరాంలోని లుంగ్లీకి చెందినది. దర్యాప్తు సంస్థ భార్య పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకుంది.

  English summary
  Luo Sang, a Chinese national who was arrested on Tuesday night in a raid by the Income Tax Department for money laundering and representing fake Chinese companies in hawala transactions, was earlier arrested by Delhi Police on spying charges.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X