వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా దురాక్రమణ: ప్రధాని మోదీ వరుస భేటీలు - మంత్రి కిషన్ రెడ్డికి ఎల్‌జీ బ్రీఫింగ్ - అటు సైనిక చర్చలు

|
Google Oneindia TeluguNews

తొలుత గాల్వాన్ లోయ.. తర్వాత దెప్సాంగ్.. ఇప్పుడేమో చుశూల్ సెక్టార్‌‌.. తూర్పు లదాక్ లో సరిహద్దులను మార్చేసేందుకు చైనా ప్రయత్నించిన ప్రాంతాలివి. గడిచిన నాలుగు నెలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారీగా బలగాలను కొనసాగిస్తోన్న చైనా.. వరుసగా ఒక్కో ప్రాంతంలో తన దుష్టవ్యూహాలను అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నది. తాజా ఘటనల నేపథ్యంలో ఢిల్లీలోనూ వ్యవహారాలు వేడెక్కాయి..

Recommended Video

India - China : సైనిక చర్యలకు సిద్ధం.. South China Sea లో భారీ యుద్ధ నౌకను మోహరించిన Bharat !

అర్దరాత్రి 200 మందితో చైనా చొరబాటు - కొత్త పాయింట్లే టార్గెట్ - పాంగాంగ్ సరస్సు వద్ద ఏంజరిగిందంటేఅర్దరాత్రి 200 మందితో చైనా చొరబాటు - కొత్త పాయింట్లే టార్గెట్ - పాంగాంగ్ సరస్సు వద్ద ఏంజరిగిందంటే

పాంగాంగ్ సరస్సుకు దక్షిణంగా ఉండే చుషుల్ సెక్టార్, స్పాన్గుర్ గ్యాప్ ప్రాంతాల్లో ఈనెల 29-30 మధ్య చైనా బలగాలు.. సరిహద్దుల్ని చెరిపేసేందుకు ప్రయత్నించగా భారత బలగాలు అడ్డుకున్నాయని ఆర్మీ అధికారులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే లదాక్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథుర్.. ఢిల్లీలోని కేంద్ర సెక్రటేరియట్ కు విచ్చేవారు. నార్త్ బ్లాక్ లోని హోం శాఖ కార్యాలయంలో సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి లదాక్ పరిస్థితులను ఎల్‌జీ వివరించారు. అనంతరం..

Chinese provocation at Pangong Lake: PM Modi Holds Meeting, L-G Gives Briefing MoS

ప్రధాని నరేంద్ర మోదీ సైతం తూర్పు లదాక్ లో ప్రస్తుత పరిస్థితిపై వరుసగా కీలక భేటీలు జరిపినట్లు వెల్లడైంది. కేంద్ర హోం, రక్షణ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు తూర్పు లదాక్ తోపాటు తాజాగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్న చుశూల్ సెక్టార్లపై ప్రధానికి బ్రీఫింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మధ్యలో గ్యాపిస్తూ చైనా వరుసగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకునేందుకు మున్ముందు ఎలాంటి ఎత్తుగడల్ని అనుసరించాలనేదానిపై ప్రధాని ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కాగా, లదాక్ స్థితిపై మోదీ రివ్యూ మీటింగ్ లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. మరోవైపు..

చైనా సైన్యాలు వరుసగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నప్పటికీ.. భారత్ మాత్రం ఇంకా శాంతిమార్గాన్నే అనుసరిస్తున్నది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము దాకా ఏ ప్రాంతంలోనైతే సరిహద్దులు చెరిపేసేందుకు చైనా ప్రయత్నించిదో.. అదే చుశూల్ సెక్టార్ లో సోమవారం చర్చలను కొనసాగించింది. చుశూల్ సెక్టార్ లోనే రెండు దేశాల మధ్య కమాండర్ల స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు భారత ఆర్మీ తెలిపింది. తాజా ఉద్రిక్తతలు సడలిపోయేలా, మొత్తంగా తూర్పు లదాక్ అంతటా ఏప్రిల్ నాటి స్టేటస్ కో పునరుద్ధరించేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది.

English summary
Hours after India thwarted China’s attempt to change the status quo by carrying out “provocative military movements" in Ladakh, R K Mathur, Lieutenant Governor of Ladakh, reached Delhi to brief the authorities about the latest face-off. Sources told that Prime Minister Narendra Modi is holding continuous meetings with persons concerned to understand the situation and it was established during the discussions that India is prepared for any eventuality. Sources added that the situation is currently under control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X