• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డోక్లామ్ ఇష్యూ: బరితెగించిన చైనా, తప్పంతా భారత్ దేనంటూ వీడియో.. వైరల్!

By Ramesh Babu
|

న్యూఢిల్లీ: మీ ఇంట్లోకి దూరిన దొంగ మిమ్మల్నే.. దొంగ దొంగ అంటే మీకెలా ఉంటుంది. ఇప్పుడు చైనా కూడా అచ్చం ఇలాగే చేస్తోంది. డోక్లామ్ ప్రాంతంలోకి రెండు నెలల క్రితం చొచ్చుకొచ్చిన చైనా.. ఇప్పడు ఆ పనిచేసింది ఇండియా అంటూ అభాండాలు వేస్తోంది.

అంతర్జాతీయ సమాజం ఎదుట భారతదేశాన్ని దోషిగా నిలబెట్టేందుకు చైనా మీడియా తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మసి పూసి మారేడు కాయ చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది.

 Chinese State Media Video Mocks India In Bizarre Propaganda On Doklam

ఇన్నాళ్లూ భారత్ ను ఉద్దేశించి రకరకాల వార్నింగ్ లు ఇస్తూ కథనాలు ప్రచురించిన చైనా అధికారిక మీడియా ఇప్పుడు ఓ తప్పుడు వీడియోను రూపొందించి అందులో భారత్ పై అనేక అభాండాలు వేసింది.

'సెవెన్ సిన్స్ ఆఫ్ ఇండియా' పేరుతో రూపొందించిన ఈ వీడియోను చైనా ప్రభుత్వ అధికారిక చానల్ జినువా ప్రసారం చేసింది. చైనా లెక్క ప్రకారం మన దేశం ఏడు పాపాలు చేసిందట.

భారత్ చేసిన ఏడు పాపాలంటూ.. ఇంగ్లిష్‌లో రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. డోక్లామ్ ప్రాంతం నుంచి భారత్ వెనక్కి తగ్గకపోవడంతో చైనా తన మీడియా ద్వారా భారత్‌పై ఇలా ఆక్రోశాన్ని వెళ్లగక్కుతోంది.

వాళ్ల ప్రాంతంలో వాళ్లు పనిచేసుకుంటుంటే.. మనదేశం బుల్ డోజర్లతో వెళ్లి అడ్డుకుందట. అసలు డోక్లామ్ ప్రాంతం చైనాదే అని ఇండియా కూడా అంగీకరించిందట. ఇండియా కావాలనే నిద్ర నటిస్తోందని, వాళ్లను నిద్ర లేపడం అసాధ్యమనీ ఈ వీడియోలో చైనా ఆరోపించింది.

పక్కనే ఉన్న చిన్న దేశం భూటాన్ ను మభ్యపెట్టి ఆ దేశ భూభాగానికి రక్షణగా ఉంటున్నామని ఇండియా చెప్పుకుంటోందట. కొసమెరుపు ఏమిటంటే.. ఈ వీడియోలో ఆఖర్న'చట్టాలను గౌరవించాలని మీ అమ్మ మీకెప్పుడూ చెప్పలేదా?' అంటూ యాంకర్ ఒక ప్రశ్న వేయడం.

తలపాగా, కళ్లద్దాలతో ఓ నటుడితో భారత యాసలో ఇంగ్లిష్ మాట్లాడిస్తూ.. తన జాత్యాహంకారాన్ని చాటింది. భూటాన్ కూడా డోక్లాం ప్రాంతం తనది కాదని చెబుతోందని, ఇండియా ప్రవర్తన పట్ల భూటాన్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోందంటూ కొత్త కథలు చెబుతోంది.

చైనాలో సోషల్ మీడియాపై నిషేధం ఉండటంతో బయట ఏం జరుగుతుందో వారికి అంతగా తెలియదు. దీంతో డోక్లాం విషయంలో తప్పంతా భారత్‌దే అని వారిని నమ్మించడానికి చైనా ప్రభుత్వం మీడియా ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In an agitprop video that has amused more than angered Indians, China's official news agency Xinhua has accused India of committing "seven sins" in the two-month-long Doklam standoff near Sikkim and embellished its comments with poorly spelt subtitles and racial stereotypes. The video, an edition of Xinhua's new "Spark" show, features anchor Dier Wang accusing India of "sins" that include "trespassing, confusing right and wrong, putting the blame on the victim, hijacking a small neighbour and sticking to a mistake knowingly." The three-minute video has been posted through Xinhua's English-language account on Twitter; the micro-blogging site is blocked in China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more