వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దులో పరిస్థితి: 1.5 కి.మీ అంటే 2 కిలోమీటర్ల వెనక్కి వెళ్లిన చైనా బలగాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదం చర్చలు సఫలం కావడంతో చైనా, ఇండియా దళాలు నియంత్రణ రేఖ నుంచి తమ బలగాలను వెనక్కితరలించాయి. బుధవారం ఈశాన్య లడఖ్‌లోని నియంత్రణ రేఖకు సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.

2 కిలోమీటర్ల వెనక్కి చైనా బలగాలు

2 కిలోమీటర్ల వెనక్కి చైనా బలగాలు

పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద చైనా, భారత్ దళాలు వెనక్కివెళ్లిపోయాయని, బుధవారం రోజుకు ఈ ప్రక్రియ పూర్తయిందని తెలిపాయి. చైనా దళాలు సుమారు 2 కిలోమీటర్ల వరకు వెనక్కి వెళ్లాయని, సోమవారం నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైందని వెల్లడించాయి. చైనా మాత్రం ఆదివారం నుంచే తన బలగాలను వెనక్కితీసుకోవడం ప్రారంభించింది.

చర్చలు కొనసాగుతాయి..

చర్చలు కొనసాగుతాయి..

1.5 కిలోమీటర్ల మేర వెనక్కి తగ్గాలని ఇరుదేశాలు నిర్ణయించాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే, చైనా మాత్రం 2 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లాయి. బలగాల వెనక్కి ప్రక్రియ పూర్తికాగానే మరోసారి చర్చలు జరుగుతాయని పేర్కొన్నాయి. సరిహద్దులో పూర్తి శాంతి నెలకొనే వరకు కూడా చర్చలు సాగుతాయని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు భారత మంత్రిత్వ శాఖ కూడా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

15న ఘటనతో ఉద్రిక్తత మొదలు

15న ఘటనతో ఉద్రిక్తత మొదలు

జూన్ 15న గాల్వన్ లోయ వద్ద చైనా బలగాలు దొంగచాటుగా భారత భద్రతా దళాలపై ఇనుపరాడ్లు, పదునైన ఆయుధాలతో దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. భారత భద్రతా దళాల ప్రతిదాడిలో చైనాకు కూడా భారీ నష్టం జరిగింది. సుమారు 45మందికిపైగా చైనా సైనికులు హతమయ్యారని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మోడీ, అజిత్ ధోవల్ ఎంట్రీతో శాంతి దిశగా చైనా..

మోడీ, అజిత్ ధోవల్ ఎంట్రీతో శాంతి దిశగా చైనా..

ఈ క్రమంలోనే ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుదేశాలు చర్చలు జరిపాయి.
మొదట సైనికాధికారులు చర్చలు జరగగా.. ఆ తర్వాత విదేశాంగ మంత్రులు కూడా ఫోన్లు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ సరిహద్దులో జవాన్లను భేటీ కావడం, కీలక ప్రసంగం చేయడం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఎంట్రీతో చైనా వెనక్కి తగ్గింది. తమ బలగాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. దీంతో భారత్ కూడా శాంతి పరిస్థితులు నెలకొనేందుకు ముందడుగు వేసింది.

English summary
The disengagement process between armies of India and China at friction points along the Line of Actual Control (LAC) in Eastern Ladakh completed on Wednesday and the Chinese troops have moved back by approximately 2 kilometres, Indian Army sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X