వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేట్రేగిన చైనా సైనికులు: లఢక్ సరిహద్దుల్లో..మళ్లీ: భారత భూభాగంపైకి: అడ్డుకున్న జవాన్లతో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా తన తీరు మార్చుకోలేదు. మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి దూసుకుని రావడానికి ప్రయత్నించారు. మనదేశ జవాన్లు వారిని అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో లఢక్ ఈశాన్య ప్రాంతం సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం నెలకొంటోంది.

Recommended Video

Ladakh Face Off : India - China బలగాల మధ్య ఘర్షణ.. భారత్ లోకి దూసుకొచ్చేందుకు China యత్నం!

సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణపూర్వక వాతావరణంను ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఈ నెల 29, 30 తేదీల్లో రాత్రి వేళ ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకనట విడుదల చేశారు. శని, ఆదివారాల్లో ఛుసుల్ బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్ సమీపంలో వాస్తవాధీన రేఖ వెంబడి ప్యాంగ్యాంగ్‌ట్సో సరస్సుకు దక్షిణ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.

 Chinese troops provocative military movements at LAC, Indian army gives befitting reply

చైనా వైఖరి వల్ల ఇప్పటిదాకా నెలకొన్న వాతావరణం ఉద్రిక్తంగా మారిందని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా చైనా సైనికులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపారు. శాంతియుతంగానే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని, అయినప్పటికీ.. చైనా దురుద్దేశంతో దాడులకు పాల్పడుతోందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు.

English summary
In yet another flare-up at the Line of Actual Control (LAC) in Ladakh, the Indian Army thwarted an attempt of the Chinese troops to carry out “provocative military movements to change the status quo”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X