వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాత్రూం వీడియోలు తీసి,బ్లాక్‌మెయిల్ చేసి,పలుమార్లు అత్యాచారం..!స్వామిపై లా విద్యార్ధిని స్టేట్‌మెంట్

|
Google Oneindia TeluguNews

ఉత్తర ప్రదేశ్‌ షాజహన్‌పూర్‌లోని తన ఇంటి నుంచి వారం రోజుల పాటు తప్పిపోయిన లా విద్యార్ధిని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై అత్యాచారం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే... కేసుపై సిట్ పోలీసులు దర్యాప్తు జరుపుతోంది. పోలీసులతో పాటు,మేజిస్ట్రేట్‌ట్ ముందు స్వామి చిన్మయానందపై తీవ్ర ఆరోపణలు చేసింది. తాను స్నానం చేస్తుండగా వీడీయో తీసి అనంతరం బ్లాక్ మెయిల్ చేశాడని, దాంతో సంవత్సరకాలంగా పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డడని ఆమే వివరించింది.

 12పేజీల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన సిట్

12పేజీల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన సిట్

లా విద్యార్ధి కేసును విచారించేందుకు సుప్రిం కోర్టు సిట్‌ను ఏర్పాటు చేయడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. సిట్ పోలీసుల విచారణలో లా విద్యార్ధి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. చిన్మయంద తనను ఎప్పుడు కలిసింది,ఆయన ఏ విధంగా వేధింపులకు పాల్పడింది వివరించింది. మొత్తం 12 పేజీల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేసినట్టు సమాచారం. విచారణలో భాగంగానే చిన్మయనందా తనకు ఆశ్రయమించి నమ్మించాడని తనకు సంబంధించిన హస్టల్లో ఉంటున్న తనకు ఆశ్రయమిచ్చి స్నానం చేస్తుండగా వీడీయోలు తీయించాడని చెప్పింది. వీడీయో చూపించి తనను బ్లాక్‌మెయిల్‌ చేశాడని చెప్పింది. సంవత్సరకాలంగా పలుసార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపినట్టు సమచారం.

ఆశ్రయమిచ్చి నమ్మించాడు

ఆశ్రయమిచ్చి నమ్మించాడు

కాగా గత సంవత్సరం జూన్‌లో అడ్మిషన్ కోసం స్వామి చిన్మయానందను కలిశానని, అడ్మిషన్ ఇచ్చిన అనంతరం తన ఫోన్ నెంబర్ చిన్మయానంద తీసుకున్నారని చెప్పింది. అనంతరం తానే ఫోన్ చేసి తన లైబ్రరీలో ఉద్యోగం ఇస్తానని చెప్పాడని తెలిపింది. అయితే తన కుటంభం బీదరికంలో ఉండడంతో తాను ఆ ఉద్యోగం చేశానని వివరించినట్టు తెలుస్తోంది. ఉద్యగం తర్వాత గత ఆక్టోబర్‌రులో ఆశ్రయంలో ఉండమని పిలిచాడని తెలిపింది. మరోవైపు హాస్టల్ బాత్రూంలలో తీసిన వీడీయో చూపించి బెదిరించాడని కొన్ని సమయాల్లో తన గన్‌మెన్‌లతో బెదిరించాడని చెప్పింది.ఇలా ఈ సంవత్సరం జూన్ వరకు వేధింపులకు గురి చేశాడని తెలిపినట్టు సమాచారం.

వేధింపులను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన విద్యార్ధిని

వేధింపులను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన విద్యార్ధిని

ఇక ఈ విషయాలను అన్ని ఆమే తన ఫేస్‌బుక్‌లో ఆరోపణలు చేసిన తర్వాత ఆమే వారం రోజుల పాటు కనిపించకుండా పోయారు. దీంతో ఆమెను చిన్మయానందే కిడ్నాప్ చేయించారని ప్రచారం జరిగింది. కాగా, సంత్ సమాజ్‌కు చెందిన ఓ పెద్దాయన చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని, తనను కూడా హత్య చేయడానికి ప్రయత్నించారని న్యాయ విద్యార్ధిని ఆరోపించింది. అంతేగాక, తనను కాపాడాలంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోడీని ఆ వీడియోలో కోరింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 కేసు విచారణకు సిట్ ఏర్పాటు

కేసు విచారణకు సిట్ ఏర్పాటు

సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించిన సుప్రిం కోర్టు వేధింపుల అంశాన్ని కొంతమంది అడ్వకేట్స్ సుప్రిం కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సుమోటగా స్వికరించింది. విచారణ అనంతరం కేసుకు సంబంధించి ప్రత్యేక ఇన్విస్టిగేషన్ టీంను (సిట్ ) ను ఐజి ర్యాంకు అధికారితో ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కొద్ది రోజుల క్రితం సుప్రిం కోర్టు ఆదేశించింది. దీంతోపాటు కేసును విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని అలహాబాద్‌ హైకోర్టును సైతం అదేశించింది. కాగా రెండు రోజుల క్రితం సిట్ పోలీసులు సుమారు 11 గంటలపాటు ఆమేను విచారించినట్టు ఆమే తెలిపింది.అయితే ఇప్పటి వరకు కూడ చిన్మయానందపై అత్యాచారం కేసును మాత్రం నమోదు చేయలేదు.

English summary
A law student in Uttar Pradesh has alleged that she was filmed, blackmailed and raped repeatedly by Chinmayanand, a senior BJP leader and former union minister who has not been questioned by the police so far. No complaint has been registered against the politician either.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X