వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో లీక్... అడ్డంగా బుక్కైన చిరాగ్ పాశ్వాన్... సరిగ్గా ఎన్నికలకు ఒక్కరోజు ముందు

|
Google Oneindia TeluguNews

లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఓ వీడియో లీకైంది. ఎన్నికల ప్రచారం కోసం చిరాగ్ ఓ వీడియో షూట్ చేయగా... దానికి సంబంధించిన రిహార్సల్‌ వీడియో బయటకొచ్చింది. దీంతో చిరాగ్ పాశ్వాన్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. సరిగ్గా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందు ఈ వీడియో బయటకు రావడంతో... ఇది ముఖ్యమంత్రి నితీశ్ పనే అని చిరాగ్ ఆరోపించారు.

ఆ వీడియోని గమనిస్తే... ఇటీవల కన్నుమూసిన తన తండ్రి,కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఫోటో పక్కన నిలబడి... విచారంతో,విషాద వదనంతో చిరాగ్ ఓ డైలాగ్ చెప్తున్నారు. అయితే ఆ డైలాగ్ సరిగా చెప్పరాకపోవడంతో మళ్లీ మళ్లీ టేక్స్ తీసుకున్నారు. సరిగ్గా టేక్ సమయంలో విషాదంగా ముఖం పెట్టడం... అది సరిగా రాకపోవడంతో మరో టేక్ తీసుకుందామని చెప్పడం అందులో కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు చిరాగ్‌పై ఓ రేంజ్‌లో సెటైర్స్ వేస్తున్నారు.

chirag paswan video leaked ljp chief blames nitish kumar

ఈ ఎన్నికల్లో లోక్‌ జనశక్తి పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందో తెలియదు కానీ... బాలీవుడ్ మాత్రం ఓ గొప్ప నటుడిని కోల్పోయిందంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చిరాగ్ ఎంత గొప్ప నటుడో... మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్‌లో ఫర్హాన్ అక్తర్ ఆయనకో అవకాశం ఇస్తే బాగుంటుందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. అటు జేడీయూ నేతలు.. ఈ వీడియోతో చిరాగ్ అసలు స్వరూపం బయటపడిందని విమర్శిస్తున్నారు. నితీశ్‌ను ఓడించడమే లక్ష్యంగా ఎన్నికల్లో దిగి.. పదేపదే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పాశ్వాన్‌కు ఇప్పుడీ వీడియో లీక్ పెద్ద తలనొప్పిలా తయారైంది. జేడీయూ నేతలు చిరాగ్‌పై దీన్నో అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది.

మరోవైపు సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌తో చిరాగ్ పాశ్వాన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ వీడియోను లీక్ చేయడం వెనుక అసలు ఉద్దేశమేంటని ప్రశ్నించారు. తన తండ్రి మరణం పట్ల తాను విషాదంలో ఉన్నానని ప్రత్యేకంగా నిరూపించుకోవాలా అని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే... నితీశ్ కుమార్ ఏ స్థాయికి దిగజారారో... ఓడిపోతానని ఎంతగా దిగులు చెందుతున్నారో అర్థమవుతోందన్నారు. తద్వారా తన వీడియో లీక్‌కి పరోక్షంగా నితీశ్‌ను నిందించారు చిరాగ్.

ఇంతకీ ఆ లీక్ వీడియోలో చిరాగ్ చెప్పిన డైలాగ్ ఏంటంటే.. ''స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా బీహార్‌ ఎక్కడి వెళ్తోంది... ఇప్పటికీ అదే వెనుకబాటుతనంలో ఉంది. అయ్యో సరిగా చెప్పలేకపోయాను... మరోసారి చేద్దాం...' అంటూ చిరాగ్ అనడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. బీహార్ ఎన్నికల్లో ఎల్‌జేపీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ వీడియోని రూపొందించారు.

English summary
A day before voting starts for the Bihar election, a video of Chirag Paswan preparing to record a speech standing next to his father Ram Vilas Paswan's photo has emerged online and his being shared on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X