వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటకలో రివర్స్: చిరు గెలిపించారు, నిలబెట్టని పవన్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు విచిత్ర పరిస్థితి! ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన బిజెపి, టిడిపి కూటమి ఘన విజయం సాధించగా, చిరంజీవి ప్రచారం చేసిన కాంగ్రెసు తుడిచి పెట్టుకుపోయింది. చంద్రబాబు అధికారంలోకి రావడంలో పవన్ ప్రచారం ప్రభావం ఎంతో కొంత కచ్చితంగా ఉంది. పవన్ ప్రభావం తమకు కలిసి వచ్చిందని టిడిపి, బిజెపి నేతలు కూడా బాహాటంగా అంగీకరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చిరు ఫెయిల్ కాగా, పవన్ కళ్యాణ్ హిట్టయ్యారు. అయితే కర్నాటకలో సీన్ రివర్స్ అయింది. చిరంజీవి విజయవంతం కాగా పవన్ ఫెయిలయ్యారు!

Chiranjeevi wins, Pawan Kalyan loses

బిజెపి అభ్యర్థుతల తరఫున ప్రచారం చేసేందుకు పవన్, కాంగ్రెసు అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు చిరు కర్నాటకకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇరువురి సభలకు భారీగా జనాలు వచ్చారు. చిరంజీవి ప్రచారం చేసిన నియోజకవర్గాలలో కాంగ్రెసు గెలుపొందగా, పవన్ ప్రచారం చేసిన చోట మాత్రం బిజెపి అభ్యర్థులు గెలవక పోవడం గమనార్హం.

వీరప్ప మొయిలీ తరఫున చిరు చిక్‌బళ్లాపూరులో ప్రచారం చేశారు. రోడ్డు షో నిర్వహించారు. మోడీ హవాను తట్టుకొని మొయిలీ స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఆయన స్వల్ప మెజార్టీతో గట్టెక్కడానికి చిరంజీవి చేసిన ప్రచారం కలిసి వచ్చిందని అంటున్నారు. తనకు వచ్చిన క్రౌడ్‌ను కొంతలో కొంత ఓట్ల రూపంలోకి మార్చడంలో చిరు సఫలమయ్యారని అంటున్నారు.

ఇదిలా ఉండగా పవన్ ప్రచారం చేసినా కోలార్, చిక్‌బళ్లాపూర్ బిజెపి అభ్యర్థులు నారాయణ స్వామి, బిఎన్ బచ్చేగౌడలు ఓడిపోయారు. పవన్ ప్రచార సభలకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. కానీ అవి ఓట్ల రూపంలోకి మారలేదని అంటున్నారు.

English summary
It must has been extremely disconcerting for Chiranjeevi to reconcile with his party's dismal show, since he was heding the campaign in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X