Actress: చిత్రా మొగుడికి చికెన్ బిర్యానీ, సార్ హిస్టరీ చాలా పెద్దదే, ఎక్కడో లాగితే ఎక్కడో కదిలింది, అంతే !
చెన్నై/ టీనగర్: తమిళ బుల్లి తెర బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుని తమిళ ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిపోయిన నటి చిత్రా ఆత్మహత్య కేసు విచారణ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎంట్రీతో రసవత్తరంగా మారిపోయింది. చిత్రా రిజిస్టర్ మ్యారేజ్ భర్త హేమనాథ్ వ్యవహారం ఎక్కడో లాగితే ఎక్కడో కదలడంతో రోజుకొకటి బయటకు రావడంతో పోలీసులు బిత్తరపోతున్నారు. హేమనాథ్ టార్చర్ పెట్టడటం వలనే చిత్రా ఆత్మహత్య చేసుకుందని ఇప్పటికే చెన్నై సిటీ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే హేమనాథ్ గంజాయికి బానిస అయ్యాడని, మెడికల్ సీట్లు ఇప్పిస్తామని అనేక మందిని మోసం చేశాడని క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో వెలుగు చూడటంతో నటి చిత్రా సన్నిహితులు బిత్తరపోయారు.
Nurse: అంబులెన్స్ లో అబ్బాయితో అదరగొట్టిన ఆంటీ, దెబ్బకు ఏరియానే హడల్, పంచాయితీతో క్లైమాక్స్ !

సీక్రెట్ మ్యారేజ్ మొగుడు
పాండియన్ స్టోర్స్ ముల్ లై పాత్రధారిణిగా చిత్ర చాలా ఫేమస్ అయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న హేమనాథ్ తో చిత్రకు పరిచయం అయ్యింది. కరోనా వైరస్ కాలంలో లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ లు లేకపోవడంతో ఇంట్లో ఖాళీగా ఉన్న చిత్ర తన స్నేహితుడు హేమనాథ్ తో ప్రేమలో పడింది. లాక్ డౌన్ సడలింపులతో గత ఆగస్టు నెలలో చిత్ర, హేమనాథ్ ల నిశ్చితార్థం జరిగింది. తరువాత హేమనాథ్ చిత్రాను బలవంతం చేసి సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడని పోలీసులు విచారణలో వెలుగు చూసింది.

బూతులు తిట్టడంతో ఆత్మహత్య
డిసెంబర్ 9వ తేదీ చెన్నైలోని నాసరాపేట్ లోని ఓ స్టార్ హోటల్ లోచి హేమనాథ్, చిత్రా వెళ్లారు. తరువాత హోటల్ గదిలో గట్టిగా తలుపులు వేసిన హేమనాథ్ చిత్రను బూతులు మాట్లాడాడని, నువ్వు బజారు మనిషివి, నీకు సిగ్గూషరం లేదని, నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు చస్తే పీడపోతుందని గట్టిగా కేకలు వేసి ఆ గదిలో నుంచి బయటకు వెళ్లిపోయాడని, తరువాత ఆవేదనతో చిత్ర ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మొదట పొంతనలేని సమాధానాలు చెప్పిన హేమనాథ్ కు పోలీసులు సరైన ట్రీట్ మెంట్ ఇవ్వడంతో హోటల్ లో జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడని వెలుగు చూసింది.

క్రైమ్ బ్రాంచ్ ఎంట్రీతో సినిమా
నటి చిత్రా ఆత్మహత్య కేసులో చెన్నై సెంట్రల్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే చిత్రా ఆత్మహత్య కేసు విచారణ చేసిన పోలీసులు ఆమె భర్త హేమనాథ్ వ్యవహారం గురించి ఒక్కొక్కటి బయటకు లాగుతున్నారు. తన కుమార్తె చిత్రాను టార్చర్ పెట్టిన అల్లుగు హేమనాథ్ భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, వ్యాపారం చెయ్యడానికి డబ్బులు అవసరం అయ్యిందని హేమనాథ్ పీడించాడని పోలీసులకు చెప్పారు. తిరువన్నియూర్ లో చిత్రా కొత్తగా నిర్మిస్తున్న ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయించాలని ఆమె భర్త హేమనాథ్ టార్చర్ చేసేవాడని ఆమె తల్లి పోలీసులకు చెప్పారు.

సార్ కు గంజాయి అలవాటు
చిత్రా భర్త హేమనాథ్ గంజాయికి బానిస అయ్యాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. హేమనాథ్ ఇంటిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు హేమనాథ్ గంజాయికి ఎలా బానిస అయ్యాడు. చిత్రాతో పరిచయం కాకముందే హేమనాథ్ కు గంజాయి సేవించే అలవాటు ఉందా ? ఎక్కడి నుంచి అతను గంజాయి సేకరించేవాడు అని చెన్నై సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇద్దరికి సంబంధమే లేదు
చిత్రా సినీ పరిశ్రమలో, టీవీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హేమనాథ్ కు అసలు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు అంటున్నారు. అలాంటప్పుడు హేమనాథ్, చిత్రాకు ఎలా పరిచయం అయ్యింది ? అంటూ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న హేమనాథ్ కు కొందరు రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

మెడికల్ కాలేజ్ సీట్ల స్కామ్ !
హేమనాథ్ కు కొందరు రాజకీయ నాయకులు పరిచయాలు ఉండటంతో అతను వారి పలుకుబడి అడ్డం పెట్టుకుని చాలా మందికి మెడికల్ కాలేజ్ లో సీట్లు ఇప్పిస్తామని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తరువాత డబ్బులు ఇచ్చిన వాళ్లు గొడవ చేసి హేమనాథ్ దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చెయ్యడానికి ప్రయత్నించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మొత్తం మీద క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎంట్రీతో చిత్రా మొగుడు హేమనాథ్ కు చిత్రాన్నం, చికెన్ బిర్యానీ తినిపిస్తున్నారని వెలుగు చూసింది.