చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Chitra: నటి రిజిస్టర్ మ్యారేజ్ మొగుడికి బెయిల్, చెన్నై పక్క చూస్తే, ఇడ్లీ సాంబార్, మదురైలో!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై: తమిళ బుల్లితెర నటి చిత్రా ఆత్మహత్య కేసులో ఆమె భర్త హేమనాథ్ కు బెయిల్ మంజూరు అయ్యింది. చిత్రా ఆత్మహత్య కేసులో ఆమె సీక్రెట్ రిజిస్టర్ మ్యారేజ్ మొగుడు హేమంత్ అలియాస్ హేమనాథ్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. హేమనాథ్ కు బెయిల్ మంజూరు చెయ్యకూడదని అతని స్నేహితుడు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైల్లో ఉన్న చిత్రా మొగుడు హేమనాథ్ కు చెన్నై హైకోర్టు షరతులతో బెయిల్ ఇచ్చింది. హైకోర్టు షరతులు ఉల్లంఘించి చెన్నై పక్క చూస్తే మనోడికి మళ్లీ సీనిమాలు ఎదురు అవుతాయని, ఇడ్లీ సాంబార్ గ్యారెంటీ అంటూ చిత్రా ఆత్మహత్య కేసు విచారణ చేస్తున్న ఓ పోలీసు అధికారి అంటున్నారు.

Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !

ప్రముఖ నటి చిత్రా

ప్రముఖ నటి చిత్రా

తమిళ బుల్లితెర నటిగా తమిళ ప్రజలు అందరికి దగ్గరైన నటి చిత్రా గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చిత్రా ఆత్మహత్య చేసుకునే ముందు హోటల్ లో ఉంటున్న గదిలో ఆమె భర్త హేమనాథ్ కూడా ఉన్నాడు. భర్త హేమనాథ్ చిత్రాను చిత్రహింసలకు గురి చెయ్యడం వలనే ఆత్మహత్య చేసుకుందని వెలుగు చూడటంతో అతన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

బెయిల్ కోసం ప్రయత్నాలు

బెయిల్ కోసం ప్రయత్నాలు


నటి చిత్రా ఆత్మహత్య కేసును ఫెడరల్ క్రిమినల్ విభాగానికి బదిలి చేశారు. ఇప్పటికే చిత్రా ఆత్మహత్య కేసులో చెన్నై సిటీ పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసి సమాచారం సేకరించారు. చిత్రా ఆత్మహత్య కేసులో జైల్లో ఉన్న ఆమె భర్త హేమనాథ్ బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును (చెన్నై హైకోర్టు) ఆశ్రయించాడు. ఇదే సమయంలో హేమనాథ్ కు బెయిల్ మంజూరు చెయ్యకూడదని అతని స్నేహితుడు రోహిత్ కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యడంతో చిత్రా మొగుడికి కష్టాలు ఎదురైనాయి.

10 ఏళ్ల నుంచి చిత్రా అండ్ కో ఫ్రెండ్స్

10 ఏళ్ల నుంచి చిత్రా అండ్ కో ఫ్రెండ్స్

తమిళనాడులోకి కాంచీపురంకు చెందిన వాడు రోహిత్. రోహిత్, అతని భార్య, హేమనాథ్ కలిసి చెన్నైలోని ఓ అద్దె ఇంటిలో నివాసం ఉండేవారు. గత 10 ఏళ్ల నుంచి రోహిత్, చిత్రా మొగుడు హేమనాథ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. రోహిత్ నటి చిత్రాకు చాలా సన్నిహితుడు, రోహిత్, అతని భార్య, హేమనాథ్, చిత్రా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో చాలా సన్నిహితంగా ఉన్నారు.

స్టార్ హోటల్ లో ఏం జరిగింది

స్టార్ హోటల్ లో ఏం జరిగింది

చిత్రా ఆత్మహత్య చేసుకునే ముందు స్టార్ హోటల్ లో ఏం జరిగింది ? అనే విషయం హేమనాథ్ పూస గుచ్చినట్లు చెబుతున్న మాటలను రోహిత్ అతని మొబైల్ ఫోన్ లో సీక్రెట్ గా రికార్డు చేశాడు. చిత్రాతో గొడవ జరిగిన 20 నిమిషాల ముందు ఆమె చాలా సైలెంట్ గా ఉండిపోయిందని, గొడవ పడిన తరువాత కొంత సేపు నాతో మాట్లాడటం మానేసిందని హేమనాథ్ చెప్పినట్లు ఆడియో టేప్ రికార్డు చేసిన రోహిత్ దానిని ఇటీవల మీడియాకు విడుదల చెయ్యడం కలకలం రేపింది.

చిత్రాకు కండీషన్స్ పెట్టిన రిజిస్టర్ మొగుడు

చిత్రాకు కండీషన్స్ పెట్టిన రిజిస్టర్ మొగుడు

ఓ షోలో నువ్వు వేరే వ్యక్తితో కలిసి జంటగా డ్యాన్స్ చెయ్యకూడదని తాను చిత్రాకు చెప్పానని హేమనాథ్ అతని స్నేహితుడు రోహిత్ కు చెప్పాడు. నేను నటి, కొందరితో కలిసి టీవీ సీరియల్స్ లో నటిస్తున్నాను, డ్యాన్స్ చెయ్యడంలో తప్పు ఏముంది అని చిత్రా తనను ప్రశ్నించిందని, ఆ సమయంలో ఇద్దరి మద్య గొడవ జరిగిందని హేమనాథ్ చెప్పిన మాటలను రోహిత్ రికార్డు చేశాడు. తరువాత తాను సిగరెట్ తాగి దానిని చిత్రా ఉన్న గదిలో విసిరేసి అక్కడి నుంచి హోటల్ కిందకు వెళ్లి పోయానని హేమనాథ్ చెప్పిన మాటల ఆడియో ఇటీవల బయటకు రావడం దూమరం రేపింది.

అప్పుడే ఆత్మహత్య కథ తెలిసింది

అప్పుడే ఆత్మహత్య కథ తెలిసింది


చిత్రా ఉన్న గదిలో నుంచి నేరుగా హోటల్ కింద ఉన్న గార్డెన్ లోకి వచ్చి సిగరెట్ తాగానని, తరువాత రూమ్ దగ్గరకు వెళ్లి తలుపులు తియ్యాలని చెప్పినా చిత్రా ఏమాత్రం స్పందించలేదని హేమనాథ్ అంటున్నాడు. తనకు అనుమానం వచ్చి రూమ్ బాయ్ సహాయంతో తలుపులు తీసి చూస్తే చిత్రా ఉరి వేసుకుని వేలాడుతోందని హేమనాథ్ పోలీసుల విచారణలో చెప్పాడు. రోహిత్ విడుదల చేసిన ఆడియో టేప్ విడుదల అయిన తరువాత హేమనాథ్ కు బెయిల్ రావడం కష్టం అయ్యింది.

షరతులు పెట్టిన హైకోర్టు

షరతులు పెట్టిన హైకోర్టు


బుల్లితెర నటి చిత్రా రిజిస్టర్ మ్యారేజ్ మొగుడు హేమనాథ్ కు చెన్నై హైకోర్టు (మద్రాసు హైకోర్టు) షరతులతో బెయిల్ ఇచ్చింది. హేమనాథ్ మదురైలో మాత్రమే ఉండాలని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని, సాక్షులను ప్రభావితం చెయ్యకూడదని చిత్రా మొగుడు హేమనాథ్ కు చెన్నై హైకోర్టు షరతులు పెట్టింది. హేమనాథ్ చెన్నై వచ్చినా, కోర్టు షరతులను ఉల్లంఘించినా అతనికి సినిమా కష్టాలు తప్పవని చిత్రా ఆత్మహత్య కేసు విచారణ చేస్తున్న ఓ పోలీసు అధికారి అంటున్నారు.

English summary
Chitra: The Madras High court granted bail to Hemnath in TV actress Chitra suicide case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X