వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడు ఎన్నికలు జరిగితే: మోడీని ధీటుగా ఎదుర్కొనే వారు ఎవరంటే?

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఇండియా టుడే - కార్వీ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ ప్రకారం నరేంద్ర మోడీకి ధీటుగా ప్రధానమంత్రి రేసులో ఎవరున్నారనే అంశంపై కూడా సర్వే చేసింది. ఈ సర్వేలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీయే ముందున్నారు.

ఇప్పటికి ఇఫ్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు అధికారంలోకి వస్తారు, ప్రధానమంత్రిగా ఎవరికి ఎక్కువ మంది ఓటు వేస్తారనే సర్వే చేశారు. ప్రధాని మోడీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అయితే మోడీని ఎదుర్కోగల సత్తా ఎవరికి ఉంది అనే సర్వేలో రాహుల్ మిగతా పార్టీల నేతల కంటే ముందు నిలిచారు.

రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీకి చాలా తక్కువ ఓట్లు

రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీకి చాలా తక్కువ ఓట్లు

రాహుల్ గాంధీ 46 శాతం ఓట్లతో ముందుండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి 8 శాతంతో, పీ చిదంబరంకు 6 శాతం, ప్రియాంక గాంధీకి 6 శాతం, అఖిలేష్ యాదవ్‌కు 4 శాతం, అరవింద్ కేజ్రీవాల్‌కు 4 శాతం మద్దతు లభించింది.

 కాంగ్రెస్ పార్టీలో ప్రధాని అభ్యర్థిగా

కాంగ్రెస్ పార్టీలో ప్రధాని అభ్యర్థిగా

కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఉండాలని అడిగితే.. 52 శాతం మంది రాహుల్ గాంధీ, 13 శాతం మంది సోనియా గాంధీలకు ఓటు వేసారు. ప్రియాంక గాంధీకి 7 శాతం, చిదంబరంకు 6 శాతం, జ్యోతిరాదిత్య సింధఇయాకు 3 శాతం, కమల్ నాథ్‌కు 2 శాతం, సచిన్ పైలట్‌కు 2 శాతం ఓట్లు వచ్చాయి.

దక్షిణాదిన రాహుల్ గాంధీ హవా

దక్షిణాదిన రాహుల్ గాంధీ హవా

ప్రాంతాల వారీగా చూస్తే మళ్లీ ప్రధాని కావాలని కోరుకున్న వారు 49 శాతం మంది ఉండగా, రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకున్న వారు 27 శాతం ఉన్నారు. ప్రాంతాల వారిగా చూస్తే.. ఉత్తరాది వారు మోడీని 56 శాతం కోరుకుంటే రాహుల్‌ను కేవలం 19 శాతం కోరుకున్నారు. తూర్పు ఇండియాలో మోడీకి 51 శాతం మంది, రాహుల్‌కు 20 శాతం మంది, వెస్ట్‌లో మోడీకి 55 శాతం, రాహుల్‌కు 24 శాతం ఓటేశారు. మోడీ కంటే రాహుల్ ముందంజలో ఉంది కేవలం దక్షిణాదిన మాత్రమే. దక్షిణాదిన రాహుల్‌ను 46 శాతం కోరుకుంటే, మోడీని 31 శాతం కోరుకున్నారు. దక్షిణాదిన కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉంది.

నగరాలు, గ్రామాల వారిగా చూస్తే

నగరాలు, గ్రామాల వారిగా చూస్తే

నగరాలు, గ్రామాల వారిగా చూస్తే మోడీని 47 శాతం మంది నగర ప్రజలు కోరుకుంటే రాహుల్‌ను 24 శాతం మంది, గ్రామీణ ప్రాంతంలో మోడీని 50 శాతం కోరుకుంటే, రాహుల్‌ను 28 శాతం కోరుకున్నారు. మహిళలు, పురుషుల పరంగా చూస్తే 50 శాతం మంది పురుషులు మోడీని, 27 శాతం మంది రాహుల్‌ను కోరుకున్నారు. 48 శాతం మంది మహిళలు మోడీని ప్రధానిగా కోరుకుంటే, 27 శాతం మంది మహిళలు రాహుల్ ప్రధాని కావాలన్నారు.

English summary
Among the Opposition leaders, Congress president Rahul Gandhi was backed by a stellar 46% of respondents, followed by TMC supremo Mamata Banerjee who was received positively by 8% people as an alternative to Modi. Six percent of those part of the survey said that former finance minister P Chidambaram and Rahul's sister Priyanka could also be a good challenger to Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X