వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరద సామగ్రి మోసుకెళుతూ కూలిన హెలికాఫ్టర్.. ముగ్గురు మృతి

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్ : వరదల్లో చిక్కుకుని సర్వం కోల్పోయిన వరదబాధితుల కోసం సామగ్రిని తీసుకెళుతున్న ఓ ప్రైవేట్ హెలికాఫ్టర్ మంగళవారం మధ్యాహ్నం ఉత్తరకాశీలో కుప్పకూలింది. ఆ సమయంలో హెలికాఫ్టర్ ఉత్తర కాశీ జిల్లాలోని మోరీ నుంచి మోల్డీకి వెళుతోంది. ప్రమాద సమయంలో చాపర్‌లో పైలట్ రాజ్‌గోపాల్, కో పైలట్ కప్తాల్‌ లాల్, రమేష్ సవార్ అనే స్థానికుడు ప్రయాణించారు. వీరు ముగ్గురు మృతి చెందినట్లు ఇండో టిబెటన్ పోలీసులు ధృవీకరించారు.

ఇదిలా ఉంటే ఉత్తరకాశీ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే వరదల ధాటికి ఆ జిల్లాలో 16 మంది మృతిచెందారు. గతవారం అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రాష్ట్రవిపత్తు నిర్వహణ సంస్థ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

Chopper carrying flood relief material crashes,All three killed

ఇక మకుది అనే గ్రామం అత్యంత భారీ నష్టానికి గురైంది. ఆదివారం కురిసిన వర్షాలకు ఇళ్లు నీటమునిగాయి. అంతేకాదు కొన్ని గృహాలు కుప్పకూలాయి. ఆరాకోట్, ముకుది, మోల్డా, సానెల్, టికోచి మరియు ద్విచాను గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఇక మోరీలో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 70 చదరపు కిలోమీటర్ల వరకు నష్టం వాటిల్లింది. ఆ ప్రాంతంలో ఉన్న 17 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా... 115 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వర్షాల ధాటికి విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.

English summary
private helicopter carrying relief material to the victims of the severe floods and cloudburst in Uttarkashi crashed on Tuesday afternoon.The helicopter was going from Mori to Moldi in Uttarkashi district. Three people were onboard the helicopter,All three have died in the crash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X