వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యవసరంగా పొలాల్లో ల్యాండైన హెలికాప్టర్, మాజీ కేంద్ర మంత్రులు సురక్షితం

By Narsimha
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నర్సింగపూర్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం అత్యవసరంగా హెలికాప్టర్ దిగింది. ఈ హెలికాప్టర్‌లో మాజీ కేంద్ర మంత్రులు కమల్‌నాథ్, సురేష్ పచోరిలు ప్రయాణీస్తున్నారు. అయితే పైలెట్ అత్యంత చాకచక్యంగా హెలికాప్టర్‌ను పొలాల్లో దించారు. దీంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఛింద్వారా నుండి ఝాటే్శ్వర్‌కు వెళ్తుంది. ఆ సమయంలో హెలికాప్టర్‌లో సాంకేతికలోపం ఏర్పడింది.ఈ విషయాన్ని గమనించిన పైలెట్ అత్యవసరంగా హెలికాప్టర్‌ను పొలాల్లో దించారు. గగనతలంలో హెలికాప్టర్ దారితప్పింది.

Chopper carrying Kamal Nath loses way in Madhya Pradesh, lands safely after 40 minutes

దీంతో పైలెట్ కరేలీ తహసీల్‌లోని కోడ్సా గ్రామంలోని పొలాల్లో హెలికాప్టర్‌ను దించేశాడు. చివరకు ఝాటేశ్వర్‌కు ఎలాగోలా చేరుకొన్నారు. అయితే నిర్ణీత సమయానికి కంటే 40 నిమిషాలు ఆలస్యంగా ఈ హెలికాప్టర్ ఝాటేశ్వర్ చేరుకొంది.

ఈ హెలికాప్టర్‌లో మాజీ కేంద్ర మంత్రులు కమల్‌నాథ్, సురేష్ పచోరి ఉన్నారు. శంకరాచార్యస్వామి స్వరూపానంద సరస్వతి ఆశీర్వాదం కోసం మాజీ కేంద్రమంత్రులు హెలికాప్టర్‌లో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకొంది.

English summary
A helicopter carrying senior Congress leader Kamal Nath from Chhindwara to Jhoteshwar in Narsinghpur district in Madhya Pradesh lost its way this morning, delaying its landing at the destination by 40 minutes, an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X