వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19 లక్షణాలు నాలో కనిపించలేదు.. కానీ పాజిటివ్‌గా నిర్థారణ, ఎలా : కొరియోగ్రాఫర్ దియా నాయుడు

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరు మాత్రం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో దీనిపై విజయం సాధించి రికవర్ అయ్యారు. అలాంటి వారు తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మిగతా ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. ఇక ప్రధాని మోడీ గత ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌లో కూడా కరోనా పై విజంయ సాధించిన వారితో మాట్లాడిని విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరుకు చెందిన దియా నాయుడు అనే మహిళ కరోనా బారిన పడి దాన్ని జయించింది. ఆమె అనుభవాలను పంచుకుంది.

కరోనా బారిన పడిన బెంగళూరుకు చెందిన దియా నాయుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. ముందుగా కరోనావైరస్ లక్షణాల గురించి మాట్లాడిన దియానాయుడు... ప్రభుత్వాలు ఈ వ్యాధికి గురించి కొన్ని లక్షణాలను చెప్పలేదని వెల్లడించారు. ఇందులో ప్రధానంగా నాలుకకు రుచి లేకపోవడం, ముక్కు వాసన పసిగ్గట్టక పోవడం వంటివి కూడా లక్షణాలే అని చెప్పారు. ముందుగా తనకు నీరసంగా ఉండేదని అప్పటికే వైరస్ తన శరీరంలోకి వెళ్లిందని దియా నాయుడు చెప్పారు. ఆ సమయంలో సరైన సమాచారం లేక ఏం చేయాలో తెలియలేదని వెల్లడించిన దియా నాయుడు ఆ తర్వాత హాస్పిటల్‌కు వెళ్లినట్లు చెప్పారు. అక్కడ మెడికల్ సిబ్బంది చాలా ఓపికతతో సమాధానాలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

ముందుగా ప్రభుత్వం సూచించిన లక్షణాలు తనలో ఏమీ కనిపించలేదని చెప్పారు. జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ లేదని చెప్పారు. అయినప్పటికీ తన శరీరంలో ఏదో తెలియని మార్పు కనిపిస్తుండటంతో హాస్పిటల్‌కు వెళ్లి చెక్ చేయించుకున్నట్లు చెప్పారు. అయితే విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు క్వారంటైన్ గురించి పెద్దగా సమాచారం లేదని వెల్లడించారు. తాను స్విట్జర్లాండ్ నుంచి వచ్చినట్లు చెప్పిన దియానాయుడు... ఆతర్వాత బెంగళూరులోని ఇందిరా నగర్‌లోని ఈఎస్ఐ హాస్పిటల్‌లో చేరినట్లు చెప్పారు. తన అనుభవాన్ని దియా నాయుడు సోషల్ మీడియాలో వివరించారు. అంతేకాదు తనతో మాట్లాడిన వారు, తనతో పాటు తిరిగిన వారు స్వీయ నియంత్రణలో ఉండాలని పిలుపునిచ్చారు.

Choreographer Diya Naidu who recovered from Covid-19 shares her experience

తనకు జ్వరం, దగ్గు, జలుబు లేవని, కేవలం వాసన పసిగట్టకపోవడం, రుచి అనేది తెలియకపోవడం వల్లే కరోనా పాజిటివ్‌‌గా నిర్థారణ అయ్యిందని చెప్పారు. అయితే ఇంట్లో ఐసోలేషన్‌కు ఎందుకు వెళ్లలేదని చాలా మంది దియాను ప్రశ్నించగా మరికొంత మంది మాత్రం ఆమెకు కోవిడ్-19 బారిన పడి మిగతా వారిని అలర్ట్ చేసిన విధానాన్ని మెచ్చుకున్నారు. అయితే వాసన, రుచి పసిగట్టకపోవడం కూడా లక్షణాలుగా పరిగణించాలని ఆమె చెప్పారు. ఇక లాక్‌డౌన్‌లోపు తన స్వస్థలంకు వెళ్లాలని భావించినా ఇంట్లో వృద్ధులు ఉన్నందున వెళ్లలేదని చెప్పారు. ఇక దియా అనుభవాలు పూర్తిగా వీడియోలో వినొచ్చు.

English summary
Choreographer Diya Naidu from Bengaluru went public on social media and said that she was tested positive for Covid-19.Diya Naidu also said that loss of taste and smell are also the main symptoms of Coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X