• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరో స్టార్‌ను కోల్పోయిన ఫిల్మ్ ఇండస్ట్రీ: వెంటాడుతోన్న మరణాలు: గుండెపోటుతో ఆమె కన్నుమూత

|

ముంబై: హిందీ చిత్రపరిశ్రమ మరో స్టార్‌ను కోల్పోయింది. ప్రముఖుల మరణాలు బాలీవుడ్‌ను వెంటాడుతున్నాయి. ప్రఖ్యాత నటుడు దిలీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్, స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతాలతో దిగ్భ్రాంతికి గురవుతోన్న బాలీవుడ్‌ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. ప్రముఖ కోరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూశారు. ఆమె వయస్సు 71 సంవత్సరాలు. గుండెపోటుతో సరోజ్ ఖాన్ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్: శ్రావణమాసం ఆరంభంలోనే: ఆ పీఠాధిపతి సలహా?

కరోనా నెగెటివ్..

కరోనా నెగెటివ్..

శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆమె కిందటి నెల 20వ తేదీన ముంబైలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ చికిత్స కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె గుండెపోటుకు గురయ్యారు. ఇక తేరుకోలేకపోయారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గుండెపోటు వల్ల సరోజ్ ఖాన్ మరణించినట్లు గురునానక్ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. ఆసుపత్రిలో చేరిన తొలిరోజే సరోజ్ ఖాన్‌కు కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా.. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ దిగ్భ్రాంతి..

బాలీవుడ్ దిగ్భ్రాంతి..

ఆమె భౌతికకాయానికి ఈ సాయంత్రం అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ముంబై మలద్ ప్రాంతంలోని మల్వాణీలో అంత్యక్రియలను నిర్వహిస్తారు. సరోజ్ ఖాన్ ఆమె భౌతికకాయాన్ని స్వగృహానికి తరలించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. సరోజ్ ఖాన్ మరణంతో బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణం తీరని లోటుగా అభివర్ణిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనిల్ కపూర్ వంటి ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 మాస్టర్‌జీగా ఫేమస్..

మాస్టర్‌జీగా ఫేమస్..

బాలీవుడ్‌లో మాస్టర్‌జీగా ఆమె బాగా పాపులర్ అయ్యారు. అందరూ ఆమెను మాస్టర‌జీగా పిలిచేవారు. తొలి మహిళా కోరియోగ్రాఫర్‌గా చరిత్ర సృష్టించారు. మూడేళ్ల చిరుప్రాయంలోనే ఆమె నటిగా బాలీవుడ్‌ తెరపై కనిపించారు. నజరానా సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. బాలీవుడ్ తొలి తరం కోరియోగ్రాఫర్ బీ సోహన్‌లాల్ వద్ద అసిస్టెంట్‌గా చేరారు. అనంతరం పూర్తిస్థాయిలో హిందీ చిత్రాలకు నృత్య దర్శకురాలిగా మారిపోయారు. కోరియోగ్రాఫర్‌గా ఆమె తొలి చిత్రం గీతా మేరా నామ్. 1974లో ఈ సినిమా విడుదలైంది.

  Why Sunny Leone Demand HIV Test Of Randeep Hooda Before Shooting Jism 2 ? || Oneindia Telugu
  శ్రీదేవి సినిమాలకు

  శ్రీదేవి సినిమాలకు

  అతిలోక సుందరి శ్రీదేవి సినిమాలకు సరోజ్ ఖాన్ నృత్య దర్శకత్వాన్ని వహించారు. శ్రీదేవి నటించిన మిస్టర్ ఇండియా, నగీనా, చాందిని సినిమాల్లోని పాటలు ఎంత హిట్ అయ్యాయో.. సరికొత్త స్టెప్పులు కూడా అంతే పాపులర్‌ అయ్యాయి. శ్రీదేవి తరువాత మాధురి దీక్షిత్‌కు కోరియోగ్రాఫర్‌గా పనిచేశారు. అనిల్ కపూర్, మాధురీ దిక్షిత్ కాంబినేషన్‌లో వచ్చిన తేజాబ్ మూవీలోని ఏక్, దో, తీన్.. పాటకు నృత్య దర్శకత్వాన్ని వహించింది సరోజ్ ఖానే. ఇప్పటికీ ఆ పాటను ఓ విజువల్‌ వండర్‌గా అభివర్ణిస్తారు. 2014లో మరోసారి మాధురీ దీక్షిత్ కోసం ఆమె పనిచేశారు. గులాబ్ గ్యాంగ్ మూవీలోని కొన్ని పాటలకు స్టెప్పులను వేశారు.

  English summary
  Choreographer Saroj Khan passes away at the age of 71, in Mumbai. She was admitted to hospital on June 20 after she complained of breathing issues. The last rites of Saroj Khan will be peformed at Malvani in Malad, Mumbai today. She died due to a cardiac arrest in the ICU of Guru Nanak Hospital where she was admitted on June 20 after she complained of breathing issues.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X