వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bishop: రేప్ కేసులో నిందితుడు, 2021 క్యాలెండర్ లో ఫోటోలు, శిక్ష పడలేదు కదా ? ఎందుకు ఆవేశం ?,

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ త్రిసూర్/న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బిషప్ ఫోటోలను 2021 నూతన సంవత్సరం క్యాలెండర్ లో ముద్రించడం వివాదానికి కేంద్ర బింధువు అయ్యింది. నన్ ను అత్యాచారం చేశాడని ఆరోపణలతో జైలుపాలైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ నూతన సంవత్సరం క్యాలెండర్ లో ఎలా ఫోటోలు ముద్రిస్తారని ఓ వర్గం వారు ఆందోళనకు దిగారు. అబ్బే అత్యాచారం చేశాడని ఆరోపణలు మాత్రమే వచ్చాయి. ఇంకా తప్పు చేశాడని రుజుకు కాలేదు కదా, ఎందుకు అంత ఆవేశం అంటూ మరో వర్గం వారు ప్రశ్నిస్తున్నారు. అత్యాచారం కేసులో అరెస్టు అయిన బిషప్ ఫోటోలు ముద్రించిన క్యాలెండర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చెయ్యడంతో రచ్చరచ్చ అయ్యింది.

Lady teacher: టీచర్స్ అక్రమ సంబంధం, ఆంటీని చంపేశారు, వెంట్రుకే కదా అనుకుంటే కొంప ముంచింది !Lady teacher: టీచర్స్ అక్రమ సంబంధం, ఆంటీని చంపేశారు, వెంట్రుకే కదా అనుకుంటే కొంప ముంచింది !

 ఫేమస్ చర్చి బిషప్

ఫేమస్ చర్చి బిషప్

కేరళలోని త్రిసూర్ లోని సిరో- మలబార్ కాథలిక్ చర్చికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సిరో మలబార్ కాథలిక్ చర్చిలో బిషప్ గా పని చేసిన ఫ్రాంకో ములక్కల్ ఫోటోలను చర్చి కమిటీ నిర్వహకులు 2021 నూతన క్యాలెండర్ లో ముద్రించారు. అత్యాచారం చేశాడని అరెస్టు అయిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ ఫోటోలు నూతన సంవత్సరం క్యాలెండర్ లో ముద్రించడం ఇప్పుడు వివాదానికి కారణం అయ్యింది.

 నన్ మీద అత్యాచారం

నన్ మీద అత్యాచారం

కేరళలోని కొట్టాయం జిల్లాలోని ఒక కాన్వెంట్ లో పని చేస్తున్న ఒక సన్యాసిని (నన్) మీద బిషప్ ఫ్రాంకో ములక్కల్ 2014 నుంచి 2016 మధ్యకాలంలో అనేక సార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. నన్ ఆరోపణలు చెయ్యడంతో పోలీసులు బిషప్ ఫ్రాంకో ములక్క్ మీద అనేక సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది.

 సార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

సార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

మార్చి నెలలో బిషప్ ఫ్రాంకో ములక్క్ బర్త్ డే వస్తోంది, చర్చి కమిటీ సభ్యులు ముద్రించిన 2021 నూతన సంవత్సరం క్యాలెండర్ లోని మార్చి నెల పేజీలో బిషప్ ఫ్రాంకో ములక్కల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ పెద్దపెద్ద ఫోటోలు ముద్రించి ఆ క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొన్ని క్రైస్తవ సంఘాలు చర్చి కమిటీ తీరుపై నిరసన వ్యక్తం చేశారని ది న్యూఇండియన్ న్యూస్ పత్రిక కథనం ప్రచురించింది.

 శిక్ష పడలేదు కదా ఎందుకు అంత ఆవేశం ?

శిక్ష పడలేదు కదా ఎందుకు అంత ఆవేశం ?

బిషప్ ఫ్రాంకో ములక్కల్ మీద కేవలం అత్యాచారం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, ఆయన తప్పు చేసినట్లు ఇంకా రుజువు కాలేదు, శిక్ష పడలేదు, కేవలం విధుల నుంచి మాత్రమే తప్పించాము, మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు అంటూ చర్చి కమిటీ సభ్యులు ఆందోళనకారులను ప్రశ్నిస్తున్నారు. వెంటనే చర్చి కమిటీ సభ్యులు ముద్రించిన 2021 నూతన సంవత్సరం క్యాలెండర్లు విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ కొన్ని క్రైస్తవ సంఘాలు కేరళలోని త్రిసూర్, కొల్లాం జిల్లాలోని ఆ చర్చి కమిటీ కార్యాలయాల ముందు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు,

సుప్రీం కోర్టు, హైకోర్టులో బిషప్ కు షాక్

సుప్రీం కోర్టు, హైకోర్టులో బిషప్ కు షాక్

బిషప్ ఫ్రాంకో ములక్కల్ ఫోటోలతో ముద్రించిన 2021 నూతన సంవత్సరం క్యాలెండర్లను కాల్చి బూడిద చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన మీద నమోదు చేసిన అత్యాచారం కేసును రద్దు చెయ్యాలని మనవి చేస్తూ బిషప్ ఫ్రాంకో ములక్కల్ కేరళ హైకోర్టును, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన మీద నమోదైన కేసులు కొట్టి వెయ్యడానికి సుప్రీం కోర్టు, కేరళ హైకోర్టు తిరస్కరించాయి. ప్రస్తుతం బిషప్ ఫ్రాంకో ములక్కల్ మీద నమోదైన కేసు విచారణ కేరళలోని కోట్టాయంలోని అడిషినల్ సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది.

English summary
Rape case: The inclusion of the photograph of a rape-accused Bishop in the official calendar of the year 2021 brought out by the Syro-Malabar church in Kerala has angered a section of the church faithful who protested by burning copies of the calendar at several places across the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X