వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ మత తీవ్రవాదులు: సీఐఏ వివాదాస్పద నిర్ణయం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన నిఘా సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), భజరంగ్‌ దళ్‌లను మత ఉగ్రవాద సంస్థలుగా సీఐఏ తన వరల్డ్‌ ఫ్యాక్ట్‌బుక్‌ తాజా సంచికలో పేర్కొంది.

ఈ సంస్థలను రాజకీయ ఒత్తిడి గ్రూపుల విభాగంలో చేర్చింది. రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ రాజకీయ ఒత్తిళ్లను పెంచే ఈ సంస్థల నేతలు మాత్రం చట్టసభల్లో తలదూర్చరని వీటి స్వభావాన్ని నిర్వచిస్తూ సీఐఏ పేర్కొంది.

CIA document tags VHP and Bajrang Dal as militant religious outfits

భారత్‌లో రాజకీయ ప్రెజర్‌ గ్రూప్స్‌లో ఆర్ఎస్ఎస్, హురియత్‌ కాన్ఫరెన్స్‌, జమౌతే ఉలేమా ఇ హింద్‌ తదితర సంస్థలను సీఐఏ పొందుపరిచింది. ఆర్ఎస్ఎస్‌ను జాతీయవాద సంస్థగా నిర్వచించిన సీఐఏ హురియత్‌ కాన్ఫరెన్స్‌ను వేర్పాటువాద గ్రూపుగా, జమైతే ఉలేమా ఇ హింద్‌ను మత సంస్థగా పేర్కొంది.

సీఐఏ ఏటా వరల్డ్‌ ఫ్యాక్ట్‌బుక్‌లో ప్రపంచ దేశాల్లో ప్రజలు, ప్రభుత్వం, సంస్థల వివరాలను ప్రచురిస్తుంది. అమెరికా విధాన రూపకర్తలకు, నిఘావర్గాలకు, దర్యాప్తు సంస్థలకు ఈ సమాచారం మెరుగైన వనరుగా భావిస్తారు.

వీహెచ్‌పీ, భజరంగ్ దళ్‌లను మత ఉగ్రవాద సంస్థలుగా పేర్కొనడంపై సంఘ్‌ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపాయి.

English summary
Sangh affiliates Vishwa Hindu Parishad (VHP) and Bajrang Dal have been classified as militant religious outfits in the recently updated World Factbook, published by the US’ Central Intelligence Agency (CIA).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X