వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ చీఫ్ అమిత్ షా భద్రతా వివరాలు చెప్పలేం, సీఐసీ క్లారిటీ, కారణం అదే, ఆర్ టీఐ!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీజేపీ జాతియ అధ్యక్షుడు అమిత్ షా కు కల్పిస్తున్న భద్రతా వివరాలు బహిరంగంగా చెప్పడం సాధ్యం కాదని కేంద్ర సమాచార శాఖ కమీషన్ (సీఐసీ) స్పష్టం చేసింది. భద్రతా కారణాల రీత్యా అమిత్ షాకు కల్పిస్తున్న భద్రత వివరాలు బహిరంగంగా చెప్పడం వీలుకాదని సీఐసీ అంటున్నది.

అమిత్ షా రాజ్యసభ సభ్యుడు కాక ముందే 2014 జులై 5వ తేదీ ఆర్ టీఐ కార్యకర్త దీపక్ జునేజా ప్రైవేటు, ప్రభుత్వ అధికారులకు కల్పిస్తున్న భద్రతా వివరాలు ఇవ్వాలని కేంద్ర సమాచార కమీషన్ (సీఐసీ)కి అర్జీ సమర్పించారు.

CIC again denied to reveal the information of security expenses given to Amit Shah.

ప్రాణహాని ఉన్న నాయకులకు, అధికారులకు కల్పిస్తున్న భద్రతా వివరాలు బహిరంగంగా చెప్పడం సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ ఆర్ టీఐ కార్యకర్త దీపక్ జునేజా అర్జీని తిరస్కరించింది. ప్రైవేటు భద్రతా వివరాలు బహిరంగంగా చెప్పడం సాధ్యం కాదని సీఐసీ స్పష్టం చేసింది.

సీఐసీ ఆదేశాలను సవాలు చేస్తూ ఆర్ టీఐ కార్యకర్త దీపక్ జునేజా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అర్జీదారుడు దీపక్ జునేజా కోరిన ఆర్ టీఐ సెక్షన్ 8 (1) g,j ప్రకారం వివరాలు వెల్లడించడానికి సాధ్యం అవుతుందా ? లేదా? అనే విషయం చెప్పాలని ఢిల్లీ హై కోర్టు సీఐసీని ఆదేశించింది.

కేంద్ర హోం శాఖ, కేంద్ర సమాచార శాఖ అధికారులు ఆర్ టీఐ కార్యకర్త దీపక్ జునేజా సమర్పించిన అర్జీని మళ్లీ పరిశీలించారు. ప్రముఖులు, ప్రాణహాని ఉన్న వారి భద్రతా వివరాలు బహిరంగంగా చెప్పడం సాధ్యం కాదని కేంద్ర సమాచార శాఖ (సీఐసీ) కమీషనర్ యశోవర్ధన్ ఢిల్లీ హై కోర్టుకు నివేదిక సమర్పించారు.

English summary
Central Information Commission again denied to reveal the information of security expenses given to Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X