చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కబాలి సినిమాస్టైల్ లో రౌడీషీటర్ బర్త్ డే పార్టీ: రౌడీ హత్యకు కుట్ర, ఒకేసారి 72 మంది!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Rajinikanth Kabali Scene in Real Life, Must Watch

చెన్నై: తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెన్నై సిటీ పోలీసులు ఒకేసారి 72 మంది పేరుమోసిన రౌడీషీటర్లను అరెస్టు చేశారు. ఒక్క రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన సిటీలోని రౌడీలు అందరూ పోలీసుల వలలో పడ్డారు. రజనీకాంత్ నటించిన కబాలి సినిమా స్టైల్ లో బర్త్ డే పార్టీలో రౌడీని హత్య చెయ్యాలని ప్లాన్ వేశారు. నిందితుల నుంచి 8 కార్లు, 32 బైక్ లు, భారీగా మారణాయుధాలు, మొబైల్ లు స్వాధీనం చేసుకున్నారు.

చెన్నైలో టాప్ రౌడీ

చెన్నైలో టాప్ రౌడీ

చెన్నై సిటీలోనే పేరుమోసిన రౌడీషీటర్ బిను మంగళవారం రాత్రి మలయంబాక్కంలోని పున్నంమల్లే ప్రాంతంలోని తోటలో పుట్టిరోజు వేడుకలు జరుపుకున్నాడు. తన పుట్టిన రోజు సందర్బంగా సిటీలో పేరుమోసిన రౌడీలు అందరికీ రౌడీషీటర్ బిను ఆహ్వానం పంపించారు. సిటీలోని దాదాపు 80 మంది రౌడీషీటర్లు బిను పుట్టిన రోజు వేడుకలకు హాజరైనారు.

కైమా కత్తితో కేక్ కటింగ్

కైమా కత్తితో కేక్ కటింగ్

బిను పుట్టిన రోజు సందర్బంగా కేక్ తెప్పించారు. అయితే కేక్ కత్తిరించే ప్లాస్టిక్ కత్తితో బిను కేక్ కట్ చెయ్యలేదు. మటన్ షాప్ లో మాంసం కైమా చేసే కత్తితో బిను కేక్ కత్తిరించి ఈలలు, కేకల మధ్య వరైటీగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. తరువాత బిను సాటి రౌడీలతో ఫోటోలు తీసుకుని మందు, విందు, చిందుల్లో గడిపాడు.

రౌడీషీటర్ కార్లు

రౌడీషీటర్ కార్లు

చెన్నైలోని పేరుమోసిన ఓ రౌడీషీటర్ మంగళవారం రాత్రి తన అనుచరులతో కలిసి రెండు కార్లలో బిను పుట్టిన రోజువేడుకలకు బయలుదేరాడు. అంత మంది ఒకే సారి రెండు కార్లలో బయలుదేరిన విషయం తాంబరం పోలీసుల కంటపడింది. ఎవరినైనా చంపడానికి వెలుతున్నారా అని పోలీసులకు అనుమానం వచ్చింది. అంతే పోలీసు జీపు పక్కన పెట్టి ట్రంక్ లో కార్లను వెంబడిస్తూ సిటీలోని పోలీసులు అందరికీ సమాచారం ఇచ్చారు.

షేడ్ లోకి కార్లు

షేడ్ లోకి కార్లు

మలయంబాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కారు షెడ్ లోకి రౌడీలు వెలుతున్న రెండు కార్లు వెళ్లాయి. తరువాత రౌడీలు తోటలో బిను బర్త్ డే పార్టీలో బిజీ అయిపోయారు. పోలీసులు అదనపుబలగాలను పిలిపించారు. ఒక్కసారిగా బర్త్ డే జరుగుతున్న ప్రాంతంలోకి వెళ్లారు.

అసలే రౌడీషీటర్లు

అసలే రౌడీషీటర్లు

పోలీసులు వస్తున్న విషయం గుర్తించిన బర్త్ డే బాయ్ బినుతో సహ చాల మంది అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వెళ్లిపోయారు. అక్కడ పోలీసులు కొందరు రౌడీలను పట్టుకున్నారు. తరువాత ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బినుతో సహ మిగిలిన వారి కోసం గాలించారు.

వెంటాడిన పోలీసులు

వెంటాడిన పోలీసులు

పోలీసులు ప్రత్యేక బృందాలు చెన్నై నగర శివార్లలోని గ్రామాల్లో గాలించి బినుతో సహ 72 మంది రౌడీషీటర్లను అరెస్టు చేశారు. నిందితులను చెన్నైలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించి విచారణ చేస్తున్నారు. వారి దగ్గర మారణాయుధాలు, మొబైల్ ఫోన్లు, కార్లు, బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.

సినిమా స్టైల్ లో హత్య

సినిమా స్టైల్ లో హత్య

తమిళనాడులో ఓ ప్రముఖ వీఐపీతో సన్నిహితంగా ఉండే రౌడీషీటర్ బిను మీద కిడ్నాప్ లు, స్మగ్లింగ్, హత్యలు తదితర క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. తన పుట్టినరోజు వేడుకలకు హాజరు అయ్యే ప్రముఖ రౌడీ రాధాక్రిష్ణన్ ను కబాలి సినిమా స్టైల్ లో అక్కడే అంతం చెయ్యాలని పక్కా ప్లాన్ వేశారని, అయితే రౌడీషీటర్ రాధాక్రిష్ణన్ అక్కడకు వెళ్లకపోవడంతో అతని ప్రాణాలు మిగిలాయని పోలీసులు అంటున్నారు.

English summary
Police has said that three rowdies escaped in the opration. Rowdy Binu celebrated his birthday yesterday in Chennai Poonamalle. In this birthday fuction three rowdies has been escaped from police. Separate police team have been set up to catch them. The rowdies plan to kill another rowdy Radhakirshnan in the function.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X