వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్‌కె నగర్ బై పోల్: పోటీ చేయనున్న విశాల్, 2021 నాటికి కొత్త పార్టీ?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

RK Nagar By Poll : This Actor Also Will Contest | Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో సినీ నటుడు విశాల్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆర్‌కె నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలోనే ఈ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఆ సమయంలో విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేశారని ఆరోపణలు రావడంతో ఎన్నికలను వాయిదా వేశారు.ప్రస్తుతం ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.

ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక విషయమై ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే రంగంలోకి దిగారు. డిఎంకె, అన్నాడిఎంకె అభ్యర్థులతో పాటు, శశికళ వర్గానికి చెందిన దినకరన్ కూడ ఈ స్థానం నుండి ఎన్నికల బరిలోకి దిగారు.

ఆసక్తికరం: 184వ,సారి పోటీ, గిన్నిస్‌బుక్‌‌లో స్థానం, ఎవరీ డాక్టర్ పద్మరాజన్?ఆసక్తికరం: 184వ,సారి పోటీ, గిన్నిస్‌బుక్‌‌లో స్థానం, ఎవరీ డాక్టర్ పద్మరాజన్?

ఆర్‌కె నగర్ ఎన్నికల్లో విశాల్ పోటీ

ఆర్‌కె నగర్ ఎన్నికల్లో విశాల్ పోటీ

తమిళనాడు రాష్ట్రంలోని ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సినీ నటుడు విశాల్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో విశాల్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారికంగా విశాల్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేదా అనే విషయాలపై విశాల్ ‌ ఏ రకంగా స్పందిస్తారోననేది ఆసక్తిగా మారింది.

కొత్త పార్టీని విశాల్ పెట్టనున్నారా?

కొత్త పార్టీని విశాల్ పెట్టనున్నారా?

తమిళనాడు సినీ నటుడు విశాల్ కొత్త పార్టీని కూడ పెట్టే అవకాశాలు కూడ ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. 2021 ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసేందుకు విశాల్ పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయాలపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే రజనీకాంత్, కమల్‌హసన్ ‌ కూడ కొత్త పార్టీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో విశాల్ పార్టీ ఏర్పాటు చేసే అంశం తెరమీదికి రావడం సంచలనం రేపుతోంది.

డిసెంబర్ 4న, విశాల్ నామినేషన్

డిసెంబర్ 4న, విశాల్ నామినేషన్

డిసెంబర్ 4వ, తేదిన విశాల్ ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో విశాల్ రంగంలోకి దిగితే ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే విశాల్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఆర్‌కె నగర్ లో 27 నామినేషన్లు

ఆర్‌కె నగర్ లో 27 నామినేషన్లు

ఆర్‌కె నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఇప్పటివరకు 27 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఇందులో ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ చోటు చేసుకొనే అవకాశం ఉంది. డిఎంకె, అన్నా డిఎంకె, దినకరన్ మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే విశాల్ రంగంలోకి దిగితే చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
Cine actor vishal may contest in RK Nagar by poll, Tamil actor Vishal may contest in RK Nagar by poll,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X