వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్టోబర్ 1 నుంచి ఆ రాష్ట్రంలో తెరచుకోనున్న సినిమా హాళ్లు

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: అన్‌లాక్‌లో భాగంగా సినిమా హాళ్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు తిరిగి తెరుచుకునేందుకు అనుమతిస్తున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో గత ఆరు నెలలుగా సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అన్ని సినిమా థియేటర్లు తెరుచుకుంటాయని సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. అన్ని మ్యూజికల్, డ్యాన్సింగ్ ఈవెంట్స్, మ్యూజిక్ షోలను కూడా అనుమతిస్తామని సీఎం తెలిపారు.

Cinema Halls To Reopen In West Bengal From October 1, says cm Mamata Banerjee

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి కార్యక్రమాలకైనా , థియేటర్లకైనా పరిమితి సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నామని తెలిపారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం లాంటి కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని సీఎం మమత స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు బెంగాల్ రాష్ట్రంలో 2,44,240 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 25,544 యాక్టివ్ కేసులున్నాయి. 2,13,975 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4721 మంది కరోనా బారినపడి మరణించారు. ఇప్పటి వరకు పశ్చిబెంగాల్ రాష్ట్రంలో 30 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు.

English summary
Cinema halls and open air theatres will be allowed to operate in West Bengal from October 1 with limited number of participants, Chief Minister Mamata Banerjee said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X