వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొమ్మ దద్దరిల్లాల్సిందే : సినిమా హాల్స్‌కు కేంద్రం "గ్రీన్" సిగ్నల్..ఎప్పుడంటే ?

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులోకి రావడంతో సినిమా హాళ్ల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్నిటినీ మూసివేశారు. అయితే తాజాగా లాక్‌డౌన్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొన్నిటికి సడలింపులను ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రీన్ రెడ్ ఆరెంజ్ జోన్లలను తీసుకొచ్చింది. ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు గ్రీన్ ఆరెంజ్ జోన్లలో కొన్నిటికి మినహాయింపులు ఇవ్వడం జరిగింది. నిత్యావసరేతర వస్తువులు కూడా అమ్మకాలు జరిపేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఇక తాజాగా షాపింగ్ మాల్స్, సినిమాహాళ్లు, స్థానిక రీటెయిల్ స్టోర్లు గ్రీన్‌జోన్లలో తెరిచి ఉంచాలనే ఆలోచన కేంద్రం చేస్తున్నట్లు సమాచారం.

భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..

 సినిమా థియేటర్స్ తెరిచేందుకు అనుమతి..?

సినిమా థియేటర్స్ తెరిచేందుకు అనుమతి..?

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. టీవీల్లో వచ్చే కార్యక్రమాలనే వీక్షిస్తూ టైం పాస్ చేశారు. ఇక సినిమా లవర్స్‌కు కేంద్రం త్వరలో తీపి కబురు చెప్పనున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమా హాళ్లను తెరవనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇటు మూవీ లవర్స్‌కు అటు సినీ ఇండస్ట్రీకి ఇది కచ్చితంగా గుడ్‌న్యూసే అవుతుంది. అయితే ఇక్కడ కూడా కొన్ని నిబంధనలను విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్ధారిత గ్రీన్ జోన్లలో వాణిజ్యపరంగా అన్నిటికీ అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా సినిమా థియేటర్లకు కూడా అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం మే 18న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమచారం. అంటే గ్రీన్‌ జోన్లలో మే 18వ తేదీ నుంచి సినిమా థియేటర్లు తెరిచే అవకాశమున్నట్లు సమాచారం.

 సినిమా థియేటర్లలో పాటించాల్సిన నిబంధనలు

సినిమా థియేటర్లలో పాటించాల్సిన నిబంధనలు

ఇక సినిమా థియేటర్లతో పాటు గ్రీన్ జోన్లలో షాపింగ్ మాల్స్‌ను కూడా తెరిచేందుకు అనుమతి ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇక రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లలను మినహాయిస్తే గ్రీన్ జోన్లలోని సినిమా హాళ్లకు మాత్రం మూడు ఆటలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయి. అంతేకాదు రాత్రి 7 గంటలలోపు ఈ మూడు ఆటలు పూర్తిచేసేలా యాజమాన్యాలు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీచేయనున్నట్లు సమాచారం. ఇక సినిమా థియేటర్‌లో కూడా సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి. అంటే సీటు సీటుకు మధ్య గ్యాప్ తప్పనిసరిగా ఉండేలా చూసుకునే బాధ్యత యాజమాన్యాలదే అని కేంద్రం నిబంధనలు విధించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు కచ్చితంగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలనే నిబంధన విధించింది. మాస్క్‌ ధరించడం కూడా తప్పనిసరి చేసింది.

 రాత్రివేళల్లో షాపింగ్ మాల్స్‌కు అనుమతి..?

రాత్రివేళల్లో షాపింగ్ మాల్స్‌కు అనుమతి..?

ఇక గ్రీన్‌ జోన్లలో కూడా ఆరెంజ్ రెడ్ జోన్లలో ఎలా అయితే నిబంధనలు ఉన్నాయో అలాంటి రూల్స్‌ను కచ్చితంగా గ్రీన్ జోన్లలోని థియేటర్లలో కూడా పాటించాలని కేంద్రం సూచించింది. ఇక షాపింగ్ మాల్స్‌ సమయం కూడా విధించింది కేంద్రం. సాయంత్రం ఆరు గంటల కల్లా వాటి షటర్స్‌ను మూసివేయాలని సూచించింది. ఇదిలా ఉంటే షాపింగ్ మాల్స్‌ను రాత్రి వేళల్లో మాత్రమే తెరిచేందుకు అనుమతి ఇవ్వాలా అన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం. రాత్రి వేళల్లో అయితే రద్దీ తక్కువగా ఉంటుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు కస్టమర్లను కూడా హ్యాండిల్ చేయడం పెద్ద కష్టం కాదని భావిస్తోంది.

English summary
Malls, Cinema Halls, And Retail stores May Open In Green Zones if sources are to be believed. This may come into effect from May 18th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X