బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు ఎయిర్ పోర్టులో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య

జీవితంపై విరక్తిపెంచుకున్న సీఐఎస్ఎఫ్ జవాను సురేష్ గైక్వాడ్ (32) కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు) టెర్మినల్ -2లో సోమవారం తన సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జీవితంపై విరక్తిపెంచుకున్న సీఐఎస్ఎఫ్ జవాను తన సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీమ విమానాశ్రయం)లో జరిగింది.

మహారాష్ట్రకు చెందిన సురేష్ గైక్వాడ్ (32) సీఐఎస్ఎఫ్ జవానుగా పని చేస్తున్నారు. ఈయన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ -2 దగ్గర సోమవారం విధులలో ఉన్నారు.

CISF jawan kills self in Bengaluru Inter National Airport

ఆ సమయంలో సరేష్ గైక్వాడ్ తన దగ్గర ఉన్న సర్వీస్ తుపాకి 5.56INSASతో తలకు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గుర్తించిన సాటి సిబ్బంది వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చారు.

సురేష్ గైక్వాడ్ ఆత్మహత్య చేసుకోవడంతో విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. విమానాశ్రయం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సురేష్ గైక్వాడ్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న మీడియా సభ్యులు అక్కడికి చేరుకోవడంతో వారిని ఎయిర్ పోర్టు అధికారులు, సిబ్బంది విమానశ్రయంలోకి అనుమతించలేదు.

English summary
A CISF jawan identified as Gayakwad Suresh(32) shot himself dead at Kempe Gowda International Airport in Bengaluru on Monday. Initial reports from the airport suggest that the man shot himself with his service rifle, a 5.56 INSAS, near gate number one of the Bengaluru airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X