• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా

|

''అబ్బబ్బా.. ఏమి ప్రభంజనం.. ఇసుకేస్తే రాలనంత జనం.. నా జీవితంలో ఇంత గొప్ప జన సమూహాన్ని చూడటం ఇదే తొలిసారి..'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాటి ఎన్నికల ర్యాలీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల రాష్ట్ర పశ్చిమ బెంగాల్ సహా దేశమంతటా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుంటే, ప్రధాని మోదీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఈసీ ఆంక్షలను బేఖాతరు చేస్తూ బీజేపీ భారీ సభలు నిర్వహిస్తున్నదని విపక్షాలు మండిపడ్డాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి దాదాపు చెక్ పెట్టినట్లుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు..

కరోనా విలయం: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు రద్దు -21న శ్రీరామ నవమి ఆన్ లైన్‌లోనేకరోనా విలయం: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు రద్దు -21న శ్రీరామ నవమి ఆన్ లైన్‌లోనే

బెంగాల్ సభలలన్నీ రద్దు..

బెంగాల్ సభలలన్నీ రద్దు..

కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో రికార్డు స్థాయిలో 2,61,500 కొత్త కేసులు, 1,501మరణాలు నమోదయ్యాయి. ఎన్నికల రాష్ట్రం పశ్చిమ బెంగాల్ లో నిన్న ఒక్కరోజే అత్యధికంగా 7,713 కొత్త కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి. బెంగాల్ లో మొత్తం కేసులు 6,51,508కి, మరణాల సంఖ్య 10,540కి పెరిగింది. కొవిడ్ విలయం నేపథ్యంలో మిగతా ఫేజ్ ల ఎన్నికలను కలిపేసి ఒకేసారి పోలింగ్ చేపట్టాలన్న వినతిని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. షెడ్యల్ లో మార్పు ఉండదని చెబుతూనే, రాజకీయ పార్టీల సభలపై ఆంక్షలు విధించింది. కానీ ప్రధాని మోదీ ఇతర పెద్ద నాయకులు పాల్గొనే సభల్లో కొవిడ్ నిబంధనలన్నీ గాల్లో కలిసిపోతున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా బెంగాల్ ఎన్నికల ప్రచారం కోసం తాను తలపెట్టిన సభలన్నిటినీ రద్దు చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.

ఇరుకున పడ్డ బీజేపీ.. ఇప్పుడెలా?

ఇరుకున పడ్డ బీజేపీ.. ఇప్పుడెలా?

కోవిడ్ ఉధృతి నేపథ్యంలో బెంగాల్ లో జరపాల్సిన అన్ని ర్యాలీలను రద్దు చేసుకున్న రాహుల్ గాంధీ.. మిగతా రాజకీయ పార్టీల నేతలు కూడా ఆ దిశగా ఆలోచించాలని విన్నవించారు. భారీ సభలను కొనసాగించడం వల్ల తలెత్తే ప్రమాదకర పరిస్థితుల గురించి ఆలోచించాలంటూ ఆదివారం ట్వీట్ చేశారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ షెడ్యూల్ రూపొందించిందన్న ఆరోపణల నేపథ్యంలో సభలు రద్దు చేసుకోవడం ద్వారా రాహుల్ దాదాపుగా ప్రధానికి చెక్ పెట్టినట్లయిందని, బీజేపీ ఇరుకున పడ్డట్లయిందని కామెంట్లు వస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికలను ఒకే రోజు పూర్తి చేయాలంటోన్న టీఎంసీ సైతం భారీ సభలను రద్దు చేసుకునే అవకాశాలున్నాయి. అసస్ సోల్ లో శనివారం నాటి మోదీ సభను ఉద్దేశించి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైరస్ విలయం కొనసాగుతోన్న సమయంలోనైనా వంచన తీరును కట్టిపెట్టండంటూ మోదీకి చురకలేశారు. ఇదిలా ఉంటే..

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూడిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూ

  TN Assembly Elections : Celebrities Voting సోషల్ మీడియాలో వైరల్ | Rajinikanth, Ajith, Vijay
  వారణాసిలో వైరస్ వ్యాప్తిపై మోదీ సమీక్ష

  వారణాసిలో వైరస్ వ్యాప్తిపై మోదీ సమీక్ష

  వైరస్ విజృంభణ కొనసాగుతున్నా శనివారం కూడా బెంగాల్ లో భారీ సభను నిర్వహించిన ప్రధాని మోదీ ఆదివారం నాడు తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కొవిడ్‌ పరిస్థితిపై ప్రధాని సమీక్ష నిర్వహించారు. వారణాసిలో వాస్తవ పరిస్థిని స్థానిక పరిపాలన అధికారులు, వైద్యులు మోదీకి వివరించారు. ఇటీవల వారణాసితోపాటు ఉత్తరప్రదేశ్‌ అంతటా కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. దీంతో యోగి సర్కార్ వారాంతపు లాక్ డౌన్ విధించింది. అంటే, శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం 7 గంటల వరకు యూపీ వ్యాప్తంగా కఠిన ఆంక్షలుంటాయి. రాహుల్ నిర్ణయం నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా బెంగాల్ ర్యాలీలను రద్దు చేసుకుంటారా, లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

  English summary
  In wake of rising cases of coronavirus in the country, Congress leader Rahul Gandhi suspended all his impending public rallies in West Bengal and urged other political leaders to deliberate on the consequences of holding large public rallies amid the present situation. Priyanka Gandhi Asks PM Modi To 'End Hypocrisy'.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X