వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమల్లోకి సీఏఏ: గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ, ఆ 3 దేశాల ముస్లిమేతరులకు ప్రయోజనం

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ.. సీఏఏ అమల్లోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. జనవరి 10వ తేదీ 2020 నుంచి చట్టం అమల్లోకి వచ్చిందని కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుద చేసింది. దీంతో బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ముస్లిమేతరులు భారత పౌరసత్వం పొందనున్నారు.

Citizenship Amendment Act comes into effect from January 10

పౌరసత్వ సవరణ చట్టం గత నెల 11వ తేదీన పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. అయితే సీఏఏ జనవరి 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తోందని కేంద్ర హోంశాఖ పేర్కొన్నది. 2014 డిసెంబర్ 31వ తేదీకి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్‌కు చెందిన హిందువు, సిక్కు, బుద్దులు, జైనులు, పర్షి, క్రిస్టియన్లు పౌరసత్వం కోసం ఇబ్బంది పడుతుంటే.. వారు అక్రమ వలసదారులు కాదని, వారికి పౌరసత్వం ఇస్తామని చట్టం చెబుతోంది.

కానీ సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దేశంలో తొలిసారి కులం ఆధారంగా పౌరసత్వం ఇవ్వబోతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ అధికార బీజేపీ మాత్రం ఆ దేశాలకు చెందిన మైనార్టీలు అక్కడ మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. వారు భారతదేశం రావడం తప్ప మరో మార్గం లేదని, అందుకే సీఏఏ తీసుకొచ్చామని సమర్థిస్తున్నారు.

English summary
Centre on Friday announced that the Citizenship (Amendment) Act will come into force from January 10
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X