వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ తాజా అల్లర్ల వెనుక కుట్ర కోణం: అంతా ప్లాన్ ప్రకారమే..: హోం శాఖ నివేదిక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని సీలంపూర్ లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న తాజా అల్లర్లు, హింసాత్మక పరిస్థితుల వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమానిస్తోంది. ఆందోళనకారులు ఓ పథకం ప్రకారమే ఈ అల్లర్లు,దాడులకు పాల్పడినట్లు భావిస్తోంది. ఈ దిశగా ఓ నివేదికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తాజాగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల్లో విద్యార్థులెవరూ లేరని నిర్ధించినట్లు సమాచారం.

ఢిల్లీ పోలీసుల మెడకు: జామియా వర్శిటీ విద్యార్థినులను లైంగికంగా: ప్రైవసీకి దెబ్బ: వైస్ ఛాన్సలర్ ఫైర్.ఢిల్లీ పోలీసుల మెడకు: జామియా వర్శిటీ విద్యార్థినులను లైంగికంగా: ప్రైవసీకి దెబ్బ: వైస్ ఛాన్సలర్ ఫైర్.

ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని సీలంపూర్ లో ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సీలంపూర్, జఫ్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 2 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో అల్లర్లు చెలరేగాయి. వందలాది మంది ఆందోళనకారులు గుంపులు, గుంపులుగా సీలంపూర్, జఫ్రాబాద్ పరిసర ప్రాంతాలకు చేరుకుని ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. వారిని నియంత్రించడానికి ప్రయత్నించిన ఢిల్లీ పోలీసులు, భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు.

Citizenship Amendment Act: Seelampur protest in East Delhi was planned, MHA sources

ఈ సందర్భంగా ఆందోళనకారులు తమ వెంట కొన్ని ప్రమాదకరమైన వస్తువులను తెచ్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అప్పటికప్పుడు ఆందోళలను చేపడితే.. అలాంటి వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయని చెబుతున్నారు. సీలంపూర్, జఫ్రాబాద్ లల్లో అల్లర్లు సృష్టించడం, స్థానికులను భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు.

ఈ దిశగా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఓ నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే దాడులు కొనసాగుతున్నాయని, సీలంపూర్, జఫ్రాబాద్ లల్లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల్లో స్థానికులు గానీ, విద్యార్థులు గానీ ఆ ఆందోళనల్లో లేరని నిర్ధారించినట్లు చెబుతున్నారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. కొందరు పోలీసు అధికారుల ముఖాలు రక్తసిక్తం అయ్యాయి. వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.

English summary
Delhi Police sources on Tuesday said that an anti-Citizenship Amendment Act (CAA) protest was scheduled in East Delhi's Seelampur and the crowd had gathered at around 1.15 pm. The protest was scheduled to be held at Seelampur at 2 pm, a detailed report has not yet come out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X