వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుకూలం 128, వ్యతిరేకం 112, పౌరసత్వ సవరణ బిల్లుపై అధికార, విపక్షాల బలబలాల అంచనాలివే..

|
Google Oneindia TeluguNews

పౌరసత్వసవరణ బిల్లు బుధవారం లోక్‌సభ ముందుకు రానుంది. దిగువసభ లోక్‌సభలో బిల్లు 311-80 తేడాతో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఎగువసభలో ఆమోదంతో చట్టరూపం దాల్చనుంది. అయితే రాజ్యసభలో అధికార బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోవడం.. శివసేన, జేడీయూ దూరంగా ఉండటంతో బిల్లు గట్టెక్కుతుందా అనుమానాలు తలెత్తుతున్నాయి.

 నేడు రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు: నెంబర్ గేమ్ మొదలు: బీజేపీ ప్రయత్నాలు ఫలించేనా..! నేడు రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు: నెంబర్ గేమ్ మొదలు: బీజేపీ ప్రయత్నాలు ఫలించేనా..!

 పౌరసత్వం ఇవ్వం

పౌరసత్వం ఇవ్వం

2014 డిసెంబర్ 31 వరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం ఇస్తామని చట్టం రూపొందించారు. దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరం వ్యక్తమైన సంగతి తెలిసిందే. రాజ్యసభలో బీజేపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో బిల్లు గట్టెక్కడంపై ఉత్కంఠ నెలకొంది.

 దూరంగా శివసేన

దూరంగా శివసేన

రాజ్యసభలో శివసేన పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీతో నెలకొన్న వివాదంతో.. కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా శివసేన బయటకొచ్చింది. బీజేపీతో అంటిముట్టనట్టుగానే ఉంటోంది. లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌కు శివసేన 12 మంది ఎంపీలు దూరంగా ఉన్నారు. రాజ్యసభలో జరిగి ఓటింగ్‌కు కూడా దూరంగా ఉంటారని తెలుస్తోంది. మరోవైపు జేడీయూ కూడా అంటిముట్టగానే వ్యవహరిస్తోంది. ఎన్డీఏలో కొసాగుతున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సరైన ప్రాధాన్యం లేదని కినుక వహించిన సంగతి తెలిసిందే.

జేడీయూ కూడా

జేడీయూ కూడా

దీంతో ఆ పార్టీ ఎంపీలు అధినేత నితిశ్ కుమార్ నిర్ణయంపై ఆధారపడి ఉన్నారు. రాజ్యసభలో జేడీయూకు ఆరుగురు ఎంపీలు ఉన్నారు. ఎన్ఆర్సీ సవరణ బిల్లుకు మద్దతిచ్చేందుకు నితీశ్ కుమార్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. కానీ బిల్లు గట్టెక్కుతుందని ప్రభుత్వ వర్గాలు ధీమాతో ఉన్నాయి.

ఇదీ లెక్క

ఇదీ లెక్క

రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240 కాగా.. బీజేపీకి 83 మంది ఉన్నారు. జేడీయూ, ఎస్ఏడీ, ఏఐఏడీఎంకే, బీజేడీ, వైసీపీతో గట్టెక్కచ్చని భావిస్తోంది. బీజేపీ 83, జేడీయూ, ఎస్ఏడీ మూడు చొప్పున అన్నాడీఎంకే 11, బీజేడీ 7, వైసీపీ ఇద్దరు సభ్యులతో తమ సంఖ్య 128కి చేరుతుందని భావిస్తోంది. దీంతో సులభంగా గట్టెక్కుతామని చెబుతుంది. శివసేనకు లెక్కగట్టకున్నా.. జేడీయూ ఎలా వ్యవహరిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

బలంగా విపక్షం

బలంగా విపక్షం


ఇక విపక్ష కూటమికి 112 ఓట్లతో బలంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, వామపక్షాలు, టీఆర్ఎస్ కూడా వీరికి జతకానుంది. లోక్‌సభ ఓటింగ్‌లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

English summary
government is all set to get the numbers required to pass the Citizenship (Amendment) Bill, 2019, in the Rajya Sabha Wednesday. but Shiv Sena and JD(U) are mya be not back in govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X