వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక తమిళ శరణార్థులను మాటేమిటి? లక్షమందికి పైగా: వారికీ..: శ్రీశ్రీ రవిశంకర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Citizenship Amendment Bill 2019 : What About Sri Lankan Tamils ? || Oneindia Telugu

చెన్నై: వివాదాలకు కేంద్రబిందువుగా భావిస్తోన్న పౌరసత్వ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమౌతున్న వేళ.. పలు అంశాలు ఇప్పుడిప్పుడే తెర మీదకి వస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లకు చెందిన ముస్లింలను టార్గెట్ గా చేసుకుని పౌరసత్వ సవరణ బిల్లును అమల్లోకి తీసుకుని వస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకకు చెందిన తమిళ శరణార్థుల అంశం కూడా వెలుగులోకి వచ్చింది.

 పౌరసత్వ సవరణ బిల్లునూ వదలని పాకిస్తాన్: హిందుత్వ అనే విషాన్ని..: మళ్లీ ఐక్యరాజ్య సమితి వద్దకు..! పౌరసత్వ సవరణ బిల్లునూ వదలని పాకిస్తాన్: హిందుత్వ అనే విషాన్ని..: మళ్లీ ఐక్యరాజ్య సమితి వద్దకు..!

లక్ష మందికి పైగా..

లక్ష మందికి పైగా..

శ్రీలంకకు చెందిన తమిళ శరణార్థులు సుమారు లక్షమందికి పైగా ఉన్నారని తెలుస్తోంది. వారంతా తమిళనాడు దక్షిణాది రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం వారికి మనదేశ పౌరసత్వం లేదు. ఫలితంగా- ఓ స్థిర చిరునామా అంటూ లేకుండా.. సంచారం చేస్తున్నారని అంటున్నారు. వారికి కూడా మనదేశ పౌరసత్వాన్ని కల్పించాలన్న డిమాండ్లు, విజ్ఞప్తులు ఊపందుకుంటున్నాయి.

 శ్రీలంక తమిళ శరణార్థులకు..

శ్రీలంక తమిళ శరణార్థులకు..


పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ల నుంచి శరణార్థులుగా భారత్ కు వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం బిల్లులో పొందుపరిచింది. శ్రీలంక అంశాన్ని ప్రతిపాదించలేదని, ఫలితంగా ఆ దేశం నుంచి భారత్ కు శరణార్థులుగా వచ్చిన తమిళుల మాటేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. వారికి కూడా పౌరసత్వ సవరణ బిల్లు కింద మనదేశ పౌరులుగా గుర్తించాలనే డిమాండ్ తమిళనాడు నుంచి వినిపిస్తోంది.

35 సంవత్సరాలుగా భారత గడ్డ మీదే..

35 సంవత్సరాలుగా భారత గడ్డ మీదే..

ఆధ్యాత్మిక గురు పండిత్ శ్రీశ్రీ రవిశంకర్, తమిళ సినీ గీత రచయిత వైరముత్తు ఈ అంశాన్ని లేవనెత్తారు. శ్రీలంక నుంచి మనదేశానికి వలస వచ్చిన శరణార్థులు లక్షమందికి పైగా నివసిస్తున్నారని, వారికి కూడా పౌరసత్వాన్ని కల్పించాలని శ్రీశ్రీ రవిశంకర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శ్రీలంకకు చెందిన తమిళ శరణార్థులు 35 సంవత్సరాలుగా మనదేశంలో నివసిస్తున్నారని, వారికి పౌరసత్వాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

మానవతా దృక్పథంతో..

శ్రీలంక తమిళ శరణార్థుల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మానవతాదృక్పథంతో పరిశీలించాల్సిన అవసరం ఉందని తమిళ సినీ గీత రచయిత వైరముత్తు అన్నారు. ఇన్ని సంవత్సరాలుగా వారంతా భారత్ నే నమ్ముకుని జీవిస్తున్నారని, వారికి పౌరసత్వాన్ని కల్పించకపోతే.. నిరాశ్రయులవుతారని చెప్పారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లను మాత్రమే ప్రస్తావించిన కేంద్ర ప్రభుత్వం.. శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులను విస్మరించదని తాను విశ్వసిస్తున్నానని అన్నారు.

English summary
Spiritual guru Sri Sri Ravi Shankar and national award winning lyricist Vairamuthu on Tuesday batted for providing citizenship to Sri Lankan Tamil refugees living in the country for more than three decades. While Ravi Shankar wanted the Centre to consider giving citizenship to over a lakh Tamil refugees, Vairamuthu said the latter should be seen as "human beings who have lost their land."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X