వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామా..!

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. చాలామంది ఈ బిల్లును స్వాగతిస్తుండగా.. అదే స్థాయిలో నిరసనలు కూడా వ్యక్తమౌతున్నాయి. ప్రత్యేకించి- ఈశాన్య రాష్ట్రాలు ఈ అంశం మీద భగ్గుమంటున్నాయి. అట్టుడికి పోతున్నాయి. అస్సాం, త్రిపురల్లో పెద్ద ఎత్తున హింసాత్మక పరిస్థితులు చెలరేగుతున్న విషయం తెలిసిందే.

ఈ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామా చేశారు. ఐపీఎస్ సర్వీసుల నుంచి వైదొలిగారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేయడాన్ని నిరసిస్తూ తాను సర్వీసుల నుంచి తప్పుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు. పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభ ఆమోదముద్ర వేసిన నిమిషాల వ్యవధిలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు.

Citizenship Amendment Bill: IPS officer Abdur Rahman resigns in protest against the Bill,

ఆ ఐపీఎస్ అధికారి పేరు అబ్దుర్ రెహ్మాన్. మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన అధికారి ఆయన. మహారాష్ట్ర పోలీసు శాఖలో ఆయన ఐజీగా పని చేస్తున్నారు. తన సర్వీసుల నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాజీనామా పత్రాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ), కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పంపించనున్నట్లు చెప్పారు.

Citizenship Amendment Bill: IPS officer Abdur Rahman resigns in protest against the Bill,

భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ వచ్చిన భారత మూల సిద్ధాంతాలకు ఈ పౌరసత్వ సవరణ బిల్లు గొడ్డలి పెట్టుగా పరిణమిస్తుందని అన్నారు. పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించినప్పటికీ.. ప్రజాస్వామ్యవాదులు దీన్ని ఖండించాలని చెప్పారు. విభజించి, పాలించు అనే విధానానికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసినట్టుగా తనకు అనిపిస్తోందని అన్నారు. ముస్లిం సామాజిక వర్గానికి నిలువ నీడ దొరకని పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు. ఇదే పరిస్థితి దళితుల, గిరిజనులు, ఆదివాసీలకు కూడా ఎదురవుతుందని అన్నారు.

English summary
Abdur Rahman, a member of the Indian Police Service, has been working for more than twenty-one years at different positions in Maharashtra. IGP Mumbai Abdur Rahman has resigned from his post after the Citizen Amendment Bill passed in Rajya Sabha on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X