వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరసత్వ సవరణ బిల్లు, పాకిస్థాన్, కాంగ్రెస్ పాడుబుద్ది, మైండ్ ఒక్కటే, ముస్లీంలకు హామీ, అమిత్ షా !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన తరువాత వాడివేడిగా చర్చ జరిగింది. దేశంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే ఈ బిల్లు ప్రవేశ పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ బిల్లు ప్రజలను పక్కదారి పట్టించేందుకు కాదని, గత ప్రభుత్వాల హాయంలో జరిగిన తప్పిదాలను ప్రధాని మోదీ ప్రభుత్వం సరిచేస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీటుగా సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, కాంగ్రెస్ పార్టీల అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని అమిత్ షా దుయ్యబట్టారు. ఆర్టికల్ 14ను ఈ బిల్లు ఉల్లంఘించలేదని అమిత్ షా స్పష్టం చేశారు. చారిత్రక తప్పిదాన్ని మేం సరిచేస్తున్నామని అన్నారు. భారతీయ ముస్లీంలను ఈ బిల్లు కించపరచబోదని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!

పాకిస్థాన్, కాంగ్రెస్ అభిప్రాయాలు ఒక్కటే !

పాకిస్థాన్, కాంగ్రెస్ అభిప్రాయాలు ఒక్కటే !

పౌరసత్వ సవరణ బిల్లుపై పత్రిపక్షాలు చేస్తున్న విమర్శలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీటుగా సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయలు ఒకేలా ఉన్నాయని అమిత్ షా ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దు తదితర విషయాల్లో పాకిస్థాన్, కాంగ్రెస్ పార్టీలు ఒకేరకమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయని అమిత్ షా గుర్తు చేశారు.

50 ఏళ్ల క్రితమే తీసుకొచ్చి ఉంటే !

50 ఏళ్ల క్రితమే తీసుకొచ్చి ఉంటే !

పౌరసత్వ సవరణ బిల్లు 50 ఏళ్ల క్రితమే తీసుకొచ్చి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేదికాదని అమిత్ షా అన్నారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యాయని, అందుకే మేము పరిస్థితి చక్కదిద్దుతున్నామని అమిత్ షా అన్నారు. తమకు రాజకీయ ఎజెండా ఉందని ప్రతిపక్షాలు విమర్శించేందుకు ఎక్కడా ఇప్పుడు ఎన్నికలు లేవని, ఆ ఆవసరం మాకు లేదని, ప్రజలను మీరే తప్పుదొవ పట్టిస్తున్నారని ప్రతిపక్షాలపై అమిత్ షా మండిపడ్డారు.

2 లక్షల మంది హిందువులు ఏమైనారు ?

2 లక్షల మంది హిందువులు ఏమైనారు ?

1992లో ఆప్గనిస్థాన్ లో దాదాపు 2 లక్షల మంది హిందువులు, సిక్కులు ఉండేవారని, 2018 యూఎస్ నివేదిక ప్రకారం ఆదేశంలో కేవలం 500 మంది మాత్రమే ఉన్నారని, మిగిలిన వారు ఏమైనారని అమిత్ షా ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఆప్గినిస్థాన్ హిందువులను ఊచకోత కోశారా ? లేక మాయం అయ్యారా అనే అనుమానం చాల మందిలో ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

భారతీయ ముస్లీంలకు హామీ ఇస్తున్నాం

భారతీయ ముస్లీంలకు హామీ ఇస్తున్నాం

పౌరసత్వ సవరణ బిల్లు భారతీయ ముస్లీంలను కించపరబోదని, మేము హామీ ఇస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మత హింసకు గురైన ముస్లీంలకు భారతీయ పౌరసత్వం ఇచ్చేందుకు ఇప్పటికే ఉన్న చట్టాల్లో నిబంధనలు ఉన్నాయని అమిత్ షా గుర్తు చేశారు. ఇస్తామిక్ దేశాల్లో ముస్లీంలు మైనార్టీలు కాదని అమిత్ షా గుర్తు చేశారు. ఆప్గినిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో ముస్లీంలను మైనార్టీలు అని పిలుస్తారా ? లేదు కదా అని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

ఆర్టికల్ 14 ఉల్లంఘించలేదు

ఆర్టికల్ 14 ఉల్లంఘించలేదు

గతంలో శ్రీలంక, ఉగాండాల నుంచి శరణార్థులు భారత్ కు వచ్చేందుకు పౌరసత్వ బిల్లుకు సవరణలు జరిగాయని అమిత్ షా గుర్తు చేశారు. ఈ బిల్లుతో భారత ముస్లీంలకు ఎలాంటి నష్టం జరగదని అమిత్ షా అన్నారు. ఆర్టికల్ 14ను ఈ బిల్లు ఉల్లంఘించలేదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వాలు చేసిన చారిత్రక తప్పిదాలను మేం సవరిస్తున్నామని అమిత్ షా అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలను సమర్థించడానికే ప్రతిపక్షాలు లేనిపోని రాద్దాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు.

English summary
Amit Shah on Citizenship bill in Rajya Sabha. We do not need to divert the attention of the people. We brought this Bill in 2015, this bill was passed in Lok Sabha, went to JPC and then was stalled in Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X