వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరులపై భద్రత బలగాల కాల్పులు: పలువురి మృతి: మండుతున్న రాష్ట్రం: దర్యాప్తునకు సీఎం ఆదేశం

|
Google Oneindia TeluguNews

కోహిమ: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో చోటు చేసుకున్న కాల్పుల ఘటన.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాల్పుల అనంతరం స్థానికులు భద్రత బలగాలపై దాడులకు దిగారు. రాళ్లు రువ్వారు. పలు వాహనాలను తగులబెట్టారు. అక్కడి పరిస్థితులు అదుపు తప్పాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. అదనపు బలగాలను తరలించింది. ప్రజలు శాంతంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి నెఫియు రియో విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించొద్దంటూ సూచించారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించారు.

నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలోని థిరు, ఒటింగ్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఒటింగ్ వద్ద గల బొగ్గు గనుల్లో పని చేసే స్థానిక యువకులు.. తమ విధులను ముగించుకుని మినీ ట్రక్‌లో ఇళ్లకు బయలుదేరారు. మార్గమధ్యలో థిరు గ్రామం వద్ద భద్రత సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. మిలిటెంట్లుగా భావించి కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కాల్పుల్లో మొత్తం 12 మంది సాధారణ పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి ఆరు మృతదేహాలను స్థానికులు స్వాధీనం చేసుకున్నారు.

అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. గ్రామీణులు భద్రత సిబ్బందిపై దాడులు చేశారు. రాళ్లు రువ్వారు. రెండు వాహనాలను తగులబెట్టారు. వారిని తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. భద్రత సిబ్బంది మరోసారి స్థానికులపై కాల్పులు జరిపారు. ఫలితంగా పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. సమాచారం అందుకున్న వెంటనే మోన్ జిల్లా పోలీస్ సూపరింటెండెండ్, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంతంగా ఉండాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేశారు.

Civilians died in a firing in Nagalands Mon district, CM announced SIT to probe, appeals for peace

ఈ ఘటనపై ముఖ్యమంత్రి నెఫియో రియో స్పందించారు. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గ్రామీణులపై కాల్పులు జరపడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించనున్నట్లు చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. ఇది దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

English summary
Civilians died in a firing incident in Oting in Mon district of Nagaland. Six bodies have been recovered from the site of the incident so far. CM Neiphiu Rio appeals for peace; SIT to launch probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X