వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీం త్రిసభ్య కమిటీ ఎదుట హాజరైన సీజేఐ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ త్రిసభ్య కమిటీ ఎదుట హాజరయ్యారు. ఆరోపణల్లో నిజాలు నిగ్గుతేల్చేందుకు ఏర్పాటైన అంతర్గత విచారణ కమిటీ సభ్యులను కలిశారు. లైంగిక ఆరోపణలపై ఏర్పాటైన విచారణ కమిటీ ఎదుటకు సీజేఐ రావడం భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి.

త్రిసభ్య కమిటీ సభ్యులను కలవాలని కోరుతూ ఇన్‌హౌస్ ఎంక్వైరీ కమిటీ పంపిన అభ్యర్థన లేఖపై జస్టిస్ రంజన్ గొగోయ్ స్పందించినట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సీజేఐ విచారణ కమిటీ సభ్యులను కలిశారు. జస్టిస్ గొగోయ్‌ విషయంలో ఇన్ కెమెరా హియరింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

నేను రాను బాబోయ్! సీజేఐపై కుట్ర కేసులో మరో వివాదానికి తెరతీసిన మహిళనేను రాను బాబోయ్! సీజేఐపై కుట్ర కేసులో మరో వివాదానికి తెరతీసిన మహిళ

CJI appeared before sc three members committee

సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎస్ఏ బాడ్జే నేతృత్వంలోని కమిటీలో జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ రంజన్ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన మహిళ మూడు రోజుల పాటు కమిటీ ఎదుట హాజరయ్యారు. అయితే తనతో పాటు లాయర్‌నిగానీ ఇతరులనుగానీ అనుమతించకపోవడంతో ఇకపై కమిటీ విచారణకు హాజరుకానని సదరు మహిళ స్పష్టం చేశారు.

English summary
Chief Justice of India Ranjan Gogoi appeared on Wednesday before the Supreme Court's three-member in-house committee, which is looking into the sexual harassment allegation against him levelled by a former employee of the top court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X